
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో Road show, బహిరంగ సభలపై నిషేదాన్ని ఈ నెల 22 వ తేదీ వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. దేశ వ్యాప్తంగా Corona కేసులు పెరిగిపోతున్నందున Election commission ఈ నిర్ణయం తీసుకొంది. Goa, Manipur Uttarakhand Punjab, Uttar Pradesh రాష్ట్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వ తేదీ వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికలను పురస్కరించుకొని రాజకీయ పార్టీలకు ఈసీ కొన్ని మినహాయింపులను అందించింది.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇవాళ వరుస సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కూడా చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నందున బహిరంగ సభలు, రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగించాలని ఈసీ నిర్ణయం తీసుకొంది. యూపీలో 84,440, ఉత్తరాఖండ్ లో 12,349, పంజాబ్ లో 34,303, గోవాలో 18,597, మణిపూర్ లో 944 చొప్పున కరోనా కేసులున్నాయి.
మరో వైపు రాజకీయ పార్టీలకు ఈసీ మినహయింపులు ఇచ్చింది. 300 మందికి మించకుండా ఇండోర్‌లలో సమావేశాలు నిర్వహించుకొనేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. మరో వైపు ఏదైనా హాల్ లో 50 శాతం ఆక్యుపెన్సీతో సమావేశాల నిర్వహణకు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ సమావేశాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తో పాటు కోవిడ్ ప్రోటోకాల్స్ కు కట్టుబడి ఉండాలని ఈసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలను ఈసీ ఆయా రాష్ట్ర, జిల్లా అధికారులకు పంపింది.
గత శనివారం నాడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో బహిరంగ ర్యాలీలు, రోడ్ షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధం విధించింది.
సీఈసీ Sushil Chandra నేతృత్వంలోని రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. అయితే ఇవాళ్టితో నిషేధం ముగియనుంది. అయితే దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున నిషేధాన్ని ఈ నెల 22 వ తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలకు, పంజాబ్ లో 117 స్థానాలకు, ఉత్తరాఖండ్ లో 70 స్థానాలకు, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో నాలుగు రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరిలో ఎన్నికలు జరిగాయి.ఈ సమయంలో ఎన్నికల నిర్వహించిన ఈసీపై విమర్శలు ఎదుర్కొంది.ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు మార్చి 10వ తేదీన నిర్వహించనున్నారు.
ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు మార్చి 10వ తేదీన నిర్వహించనున్నారు.ఎన్నికలు జరిగే ఐదు రాస్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కీలకం. ఈ రాష్ట్రంలో విజయం సాధించేందుకు బీజేపీ, ఎస్పీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యోగి కేబినెట్ లో మంత్రులు బీజేపీని వీడి ఎస్పీలో చేరారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా ఎస్పీలో చేరారు. బీజేపీ నుండి ఇక నుండి ఎవరిని కూడా తమ పార్టీలో చేర్చుకోబోమని అఖిలేష్ యాదవ్ చెప్పారు.