ఆరు రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 4న పోలింగ్: ఈసీ షెడ్యూల్ విడుదల

Published : Sep 09, 2021, 01:09 PM IST
ఆరు రాజ్యసభ స్థానాలకు  అక్టోబర్ 4న పోలింగ్:  ఈసీ షెడ్యూల్ విడుదల

సారాంశం

ఐదు రాష్ట్రాల్లోని ఆరు రాజ్యసభ ఎన్నికలతో పాటు బీహార్ లో శాసనమండలి స్థానానికి అక్టోబర్ 4వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈసీ గురువారం నాడు షెడ్యూల్ ను విడుదల చేసింది. 

న్యూఢిల్లీ:ఐదు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ గురువారం నాడు విడుదల చేసింది.తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.మరో వైపు పుదుచ్చేరి రాష్ట్రం నుండి ఖాళీ కానున్న శాసనమండలి స్థానానికి కూడ అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్ రాష్ట్రంలోని శాసనమండలి స్థానానికి కూడ  అదే రోజున పోలింగ్ నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల విషయంలో ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొన్న తర్వాత బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేసింది ఈసీ. ఆయా రాష్ట్రాలు ఎన్నికల నిర్వహణకు సిద్దంగా లేనందున ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఈసీ ప్రకటించిందిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం