పంజాబ్ కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రా.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది గంటల ముందు..

By Sumanth KanukulaFirst Published Jan 8, 2022, 3:38 PM IST
Highlights

పంజాబ్ కొత్త డీజీపీగా వీరేష్‌ కుమార్‌ భవ్రా (Viresh Kumar Bhawra) నియమితులయ్యారు. ఆయన నియామకానికి సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) ఆమోదం తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అధికారులలో పంజాబ్ ప్రభుత్వం వీకే భవ్రాను ఎంపిక చేసింది. 

పంజాబ్ కొత్త డీజీపీగా వీరేష్‌ కుమార్‌ భవ్రా (Viresh Kumar Bhawra) నియమితులయ్యారు. ఆయన నియామకానికి సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) ఆమోదం తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అధికారులలో పంజాబ్ ప్రభుత్వం వీకే భవ్రాను ఎంపిక చేసింది. వీకే భవ్రా 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. వీరేష్ కుమార్ భవ్రా.. పంజాబ్‌తోపాటు, సెంట్రల్ ఇంటలిజెన్స్ బ్యూరో కీలక స్థానాల్లో పనిచేశారు. ఆయన పంజాబ్‌ డీజీపీగా రెండేళ్లు ఉండనున్నారు. ఇక, ప్రస్తుతం సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ పంజాబ్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీరేష్ కుమార్ భవ్రాతో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు దినకర్ గుప్తా (Dinkar Gupta), ప్రభోద్ కుమార్‌ (Prabodh Kumar) పేర్లతో కూడిన జాబితాను పంజాబ్ ప్రభుత్వానికి పంపింది. అయితే చన్నీ నేతృత్వంలోనే వీరేష్ కుమార్ ప్రభుత్వం వీరేష్ కుమార్‌ భవ్రాను నూతన డీజీపీగా ఎంపిక చేసింది. 2018 జూలై 3 నాటి సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి వీరేష్ కుమార్ భవ్రా పదవీకాలం కనీసం రెండు ఏళ్లు ఉండనుందని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. 

ఇక, పంజాబ్‌లో 100 రోజుల వ్యవధిలో డీజీపీ మార్పు చోటుచేసుకోవడం ఇది మూడోసారి. ఎన్నికల సంఘం.. పంజాబ్‌తో పాటుగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయనున్న కొద్ది గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇటీవల ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటన‌లో చోటుచేసున్న భద్రత వైఫల్యంపై కేంద్ర హోం శాఖ సీరియస్‌గా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పంజాబ్ ప్రస్తుత డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ, ఇతర సీనియర్ అధికారులకు కేంద్ర హోం శాఖ సమన్లు పంపించిన సంగతి తెలిసిందే. 

click me!