
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. మామిడి పండ్లు ఇస్తానని చెప్పి పిలిచి మూడేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తుగ్లకాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలి కుటుంబం .. నిందితుడు తమ ఇంటికి తరచూ వస్తుంటుందని ఆరోపించింది. ఘటన జరిగిన రోజు.. వృద్ధుడు బాధితురాలిని తన ఇంట్లోకి పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని దుర్వాస అనే వ్యక్తిగా గుర్తించారు. రాత్రి బాధితురాలి ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది. ఈ ఘటనపై గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇకపోతే.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ (gang rape) జరిగిన ఘటన హైదరాబాద్ (ys jagan) చాంద్రాయణగుట్ట (chandrayangutta) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉండే 14 ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవపడి బయటికి వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురు యువకులు మీ తల్లి దగ్గర దించుతామని నమ్మించారు. అనంతరం ఆమెపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాలిక శనివారం సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఎక్కడికి వెళ్లావని బాలికను నిలదీయడంతో అసలు విషయాన్ని తెలిపింది. దీనిపై బాధితురాలి తల్లి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.