రిపబ్లిక్ డే చీఫ్ గెస్టుగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్‌సిసి

By Mahesh KFirst Published Jan 20, 2023, 7:50 PM IST
Highlights

రిపబ్లిక్ డే చీఫ్ గెస్టుగా ఈ సారి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్‌సిసి పాల్గొంటారు. ఈ నెల 24వ తేదీన ఆయన న్యూఢిల్లీకి వస్తారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపారు. ఈ పర్యటనలో ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలూ జరిగే అవకాశాలు ఉన్నాయి.
 

న్యూఢిల్లీ: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్‌సిసి భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వచ్చే వారం అబ్దుల్ ఫతే ఎల్‌సిసి భారత్‌కు రాబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దీంతో భారత రిపబ్లిక్ డేకు పశ్చిమాసియా దేశం నుంచి, అరబ్ దేశాల నుంచి వస్తున్న ఐదో  చీఫ్ గెస్టుగా ఆయన నిలుస్తారు.

ఈ నెల 24వ తేదీన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్‌సిసి న్యూఢిల్లీకి వస్తారు. అబ్దుల్ ఫతే ఎల్‌సిసిని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఆహ్వానిస్తారు. ఆ తర్వాతి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్‌సిసితో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. దేశ ఉపరాష్ట్రపతిని కూడా కలుస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా అబ్దుల్ ఫతే ఎల్‌సిసి పాల్గొంటారు.

Also Read: రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదు.. : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్‌సిసి పర్యటనతోపాటు 180 మంది సభ్యులతో ఈజిప్టుకు చెందిన స్ట్రాంగ్ కాంటింజెంట్ మన పరేడ్‌లో పాల్గొనబోతున్నారు. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు పెట్టే అవకాశాలు ఉన్నట్టు కొన్ని వర్గాలు వివరించాయి.

click me!