ఉద్దవ్ థాకరే శివసేన టీమ్ నేత సన్నిహితులకు ఈడీ సమన్లు..

By Mahesh RajamoniFirst Published Nov 27, 2022, 12:59 AM IST
Highlights

Mumbai: చీటింగ్ కేసులో ఉద్ద‌వ్ థాకరే వ‌ర్గానికి చెందిన శివ‌సేన‌ నేత అనిల్ పరబ్ సన్నిహితుడికి ఈడీ సమన్లు జారీ చేసింది. దపోలీలోని రిసార్ట్ నిర్మాణంలో తీరప్రాంత నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మ‌నీలాండరింగ్ కేసులో అనిల్ పరబ్, అతని సహాయకుడు సదానంద్ కదమ్ ను ఆర్థిక దర్యాప్తు సంస్థ గతంలో ప్రశ్నించింది.
 

Enforcement Directorate (ED) : మహారాష్ట్రలోని దాపోలిలో రిసార్ట్ నిర్మాణంలో అవ‌క‌త‌వ‌క‌లు, ఆర్థిక మోసాల కేసుకు సంబంధించి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు అనిల్ పరబ్ సన్నిహితుడు సదానంద్ కదమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​పంపింది. సదానంద్ కదమ్ శివ‌సేన మాజీ ఎంపీ రాందాస్ కదమ్ సోదరుడు. వచ్చే వారం ఏజెన్సీ ముందు హాజరుకావాలని త‌న నోటీసుల్లో ఈడీ పేర్కొంది.  దాపోలిలో రిసార్ట్ నిర్మాణంలో తీరప్రాంత నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పరాబ్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఆర్థిక దర్యాప్తు సంస్థ కదమ్, పరాబ్‌లను గతంలో ప్రశ్నించింది.

కదమ్ 2020లో దాపోలీలోని మురుద్ తహసీల్‌లో తనకు, అనిల్ పరాబ్‌కు మధ్య అమలు చేయబడిన రిజిస్టర్డ్, స్టాంప్డ్ సేల్ డీడ్ ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూమిని వ్యవసాయం నుండి 'వ్యవసాయేతర' ప్రయోజనాలకు మార్చడానికి అవసరమైన అనుమతులు పొందిన తరువాత,  కదమ్ రెండు అంతస్తుల నిర్మాణాన్ని నిర్మించడం ప్రారంభించాడు. ఈ నిర్మాణం మొదట వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన‌దిగా ఉద్దేశించబడింది. అయితే, పర్యాటకం పెరగడంతో, కదమ్ స‌ద‌రు నిర్మాణాన్ని రిసార్ట్‌గా మార్చాలని నిర్ణయించుకున్నారు.అయితే, ఈ నిర్మాణం ఇంకా పూర్తిగా పూర్తికాలేదు. ఎప్పుడూ పనిచేయలేదు.. నివాస బంగ్లాగా లేదా రిసార్ట్‌గా ఉపయోగించబడలేదు అని కదమ్ కోర్టుకు ఇదివ‌ర‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఇదిలావుండ‌గా, ఉద్ద‌వ్ థాక‌రే నేతృత్వంలో శివ‌సేన వ‌ర్గానికి చెందిన ఎంపీ సంజ‌య్ రౌత్ ను సైతం ఇదివ‌ర‌కు ఈడీ మ‌నిలాండ‌రింగ్ కేసులో అదుపులోకి తీసుకుంది. సుదీర్ఘ విచార‌ణ‌ల త‌ర్వాత‌.. ఇటీవ‌లే ఆయ‌న బెయిల్ రావ‌డంతో బ‌య‌ట ఉన్నారు. అయితే, సంజ‌య్ రౌత్ రాష్ట్రంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను మార్చ‌నున్నారంటూ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

ఈడీ కేసులో బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో సంజయ్ రౌత్ తన తదుపరి చర్య గురించి విశ్వసనీయులు, ప్రత్యర్థులు ఇద్దరూ ఊహించి ఉండవచ్చని శివసేన (యూబీటీ) వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలతో చర్చలకు కొత్త మార్గాలను తెరవడం ద్వారా రాజకీయ సమీకరణాల్లో మార్పును తీసుకురావడానికి ఆయ‌న ప్రయత్నిస్తున్నారని వారు సూచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ల‌ను కలుస్తానంటూ  ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు బెయిల్ విడుదల చేసిన త‌ర్వాత ముంబ‌యిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రౌత్ అన్నారు.

అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బెయిల్ పై వ‌చ్చిన త‌ర్వాత బీజేపీ నేత‌ల‌కు అనుకూలంగా సంజ‌య్ రౌత్ వ్యాఖ్య‌లు చేయ‌డంపై సొంత వ‌ర్గం నేత‌లు వివిధ ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈడీ అరెస్టుల క్ర‌మంలో మ‌ళ్లీ వారితో జ‌తక‌ట్ట‌డానికి ముందుకు సాగుతున్నార‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే, ఆయ‌న ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తోనే ముందుకు న‌డుస్తున్నార‌నీ, ఆయ‌న రాజ‌కీయ ఎత్తుడ‌గ‌లు వేరేలా ఉన్నాయ‌నే వారు ఉన్నారు. ఏదేమైన మ‌హారాష్ట్రలో మ‌ళ్లీ ఈడీ దూకుడుతో రాజ‌కీయాలు హీటెక్క‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది. 

click me!