సోనియా గాంధీ అల్లుడి చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు...

By Arun Kumar PFirst Published Nov 30, 2018, 2:51 PM IST
Highlights

గతంలో యూపిఏ కేంద్ర ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమాలకు పాల్పడ్డట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తేలిసిందే. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వాద్రా భూఆక్రమణలు, అక్రమ లావాదేవీలు చేపట్టినట్లు ఇతడిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులకు సంబంధించి వాద్రా చుట్టు ఉచ్చు బిగుస్తోంది.   
 
రాజస్థాన్ బికనీర్ భూవివాదం కేసులో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. దీంతో వాద్రా మరోసారి వార్తల్లో నిలిచారు. పదేళ్ల క్రితం రాజస్థాన్ బికనీర్ జిల్లా కొలాయట్ ప్రాంతంలోని భూఅక్రమాలు జరిగినట్లు...అందులో వాద్రాకు చెందిన కంపనీలు ముఖ్యమైన పాత్ర వహించినట్లు ఇదివరకే  కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణ సందర్భంగా వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

వాద్రాపై భూకబ్జాల ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు గతంలో రాజస్థాన్‌లో తనిఖీలు నిర్వహించారు. దీంతో బికనీర్‌లో ప్రాంతంలో వాద్రాకు చెందిన కంపనీ 275 ఎకరాలు భూమి కొనుగోలు సమయంలో అక్రమ లావాదేవీలు జరిపిందని అధికారులు గుర్తించారు. దీంతో మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధమున్న సంస్థలు, వ్యక్తులను పలుమార్లు తనిఖీ చేసిన ఈడీ ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే వాద్రాకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
 
click me!