నా ఇంటి ముందే నడుస్తావా....పనిమనిషి వేళ్లు కొరికేసిన మహిళ

sivanagaprasad kodati |  
Published : Nov 30, 2018, 01:53 PM IST
నా ఇంటి ముందే నడుస్తావా....పనిమనిషి వేళ్లు కొరికేసిన మహిళ

సారాంశం

ఢిల్లీలో దారుణం జరిగింది. తన మాట వినకుండా తమ ఇంటి ముందు నడిచివెళ్లిందన్న అక్కసుతో ఓ మహిళ పనిమనిషి చేతి వేళ్లను కొరికేసింది. సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్లలో ఉషా అలియాస్ మంజు అనే మహిళ స్వీపర్‌గా పనిచేస్తోంది. 

ఈ క్రమంలో బుధవారం బుధవారం ఒక బ్లాక్‌ను శుభ్రపరిచి.. వేరొక బ్లాక్‌కు వెళుతోంది. ఆ సమయంలో సరిత అనే గృహిణి తమ ఇంటి ముందు నుంచి కాకుండా మరో మార్గం గుండా వెళ్లాలని హెచ్చరించింది. దీనిపై ఇద్దరి మధ్యా వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పట్టరాని కోపంతో ఊగిపోయిన సరిత పనిమనిషిపై చేయి చేసుకుంది.

అంతేకాకుండా ఆమె చేయిని పట్టుకుని చేతి వేళ్లని కొరికేసింది. నొప్పులు తాళలేక ఉష కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. సరితను పట్టుకుని పనిమనిషిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఉష తన వేలిని కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరితను అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Telegram Banned: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్‌తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది?
PAN Card: పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు