ఫెర్టిలైజర్ స్కామ్: రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ సోదరుడికి ఈడీ సమన్లు

By narsimha lodeFirst Published Jul 29, 2020, 10:44 AM IST
Highlights

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.ఇవాళ జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.ఇవాళ జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.

ఈ నెల 22వ తేదీన అగ్రసేన్ గెహ్లాట్ కు చెందిన పలు సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా సేకరించిన ఆధారాల ప్రకారంగా అగ్రసేన్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

2007-2009 మధ్య ఎరువుల కొనుగోలు, సరఫరాలో అవకతవకలు జరిగినట్టుగా బీజేపీ ఆరోపణలు చేసింది. నిబంధనలకు విరుద్దంగా సబ్సిడీ ఎరువులను విదేశాలకు ఎగుమతి చేశారని గెహ్లాట్ సోదరులపై బీజేపీ విమర్శలు గుప్పించింది.

also read:ఫెర్టిలైజర్ స్కామ్‌పై బీజేపీ ఆరోపణలు:ఆశోక్ గెహ్లాట్ సోదరుడి సంస్థలపై ఈడీ సోదాలు

ఈ విషయమై కస్టమ్స్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేసింది.ఈ కేసు విచారణ 2013లో ముగిసింది. ఈ కేసుకు సంబంధించి జూలై 13వ తేదీన కస్టమ్స్ డిపార్ట్ మెంట్ ఛార్జీషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ కు పాల్పడినట్టుగా  ఆరోపించింది.

ఇదే కేసులో ఆశోక్ గెహ్లాట్ సోదరుడిపై కస్టమ్స్ కేసు నమోదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు రూ. 60 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 

రెబెల్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం ఆశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు చేశారు. ఈ సందర్భంలో ఈ విచారణ చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

click me!