
ED raids at Lyca Productions office: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి, హిట్ చిత్రాలుగా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. నిర్మాణ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నైలోని దాదాపు ఎనిమిది చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. బాక్సాఫీస్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరొందిన లైకా ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో మంగళవారం ఈడీ దాడులు చేసింది. ఈ సంస్థకు చెందిన చెన్నైలోని పలు కార్యాలయాల్లో ఈడీ దాడులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ దాడులకు సంబంధించి నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనలు రాలేదని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
లైకా సంస్థ బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను నిర్మించింది. నిర్మాణ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన తర్వాత చెన్నైలోని సుమారు ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్టు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోందని ఎన్డీటీవీ నివేదించింది. . నిర్మాణ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో రాజధానిలోని దాదాపు ఎనిమిది చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని సంబంధిత కథనం పేర్కొంది.
లైకా ప్రొడక్షన్స్ ను సుభాస్కరన్ అల్లిరాజా 2014లో స్థాపించారు. లైకామొబైల్ ఉప సమూహమైన ఈ నిర్మాణ స్టూడియో దక్షిణ భారతదేశంలో తయారైన చిత్రాల నిర్మాణం, పంపిణీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టీ నగర్, అడయార్, కరపాక్కం సహా ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. లైకా మొబైల్స్ సహా పలు బ్రాండ్లను కలిగి ఉన్న లైకాపై ఫెమా అభియోగానికి సంబంధించి ఈడీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.