వీధి కుక్కల కంటే ఈడీనే ఎక్కువగా తిరుగుతోంది - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఘాటు వ్యాఖ్యలు

By Asianet News  |  First Published Oct 27, 2023, 4:08 PM IST

దేశంలో వీధి కుక్కల కంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎక్కువగా తిరుగుతోందని  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ఈడీతో ఇలా దాడులు చేయిస్తోందని ఆరోపించారు.


ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై రాజస్థాన్  ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వీధి కుక్కల కంటే ఈడీనే ఎక్కువగా తిరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లోని కొందరు కాంగ్రెస్ నేతల నివాసాలపై ఆ కేంద్ర దర్యాప్తు సంస్థ గురువారం దాడులు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన ఈడీ ఈ విధంగా మండిపడ్డారు. 

డ్యూటీలో ఉన్న పోలీసునే ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరి కింద పడి, తీవ్రగాయాలపాలైన కానిస్టేబుల్.. వీడియో వైరల్

Latest Videos

రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఆయన శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దేశంలో కుక్కల కంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దే పైచేయిగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తన 'గ్యారంటీ మోడల్'ను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధిపతులను తాను సమయం కోరానని, కానీ అవే ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మారాయన్నారని ఆరోపించారు.

जयपुर से राजस्थान में लाइव: https://t.co/LWyjgfbQiM

— Ashok Gehlot (@ashokgehlot51)

తన కౌంట్ డౌన్ మొదలైందన్న విషయం మోడీకి తెలియనట్లుందని అశోక్ గెహ్లాట్ అన్నారు. ‘ఆయన ఇప్పుడు మా గ్యారంటీ మోడల్ ను అనుసరిస్తున్నారు’ అని అన్నారు. కాగా.. గురువారం కూడా సీఎం గెహ్లాట్ ఈడీ చర్యలను ఖండించారు. దేశంలో ఉగ్రవాదం చెలరేగిందని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కూలదోయలేకనే బీజేపీ ఇలాంటి దాడుల ద్వారా తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా జైపూర్, సికార్ లోని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా నివాసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు చేసింది. అలాగే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడికి విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో సమన్లు జారీ చేసింది.

దారుణం.. ఎనిమిదేళ్ల విద్యార్థినిపై యాసిడ్ పోసిన గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం.. అసలేం జరిగిందంటే ?

పాఠశాల విద్యాశాఖ మాజీ మంత్రి అయిన 59 ఏళ్ల దోతాస్రా నివాసాలతో పాటు, దౌసాలోని మహువా నియోజకవర్గానికి చెందిన పార్టీ అభ్యర్థి ఓంప్రకాశ్ హుడ్లా, మరికొందరి నివాసాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ఈ సోదాలు చేపట్టారు. కాగా.. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. 
 

click me!