
ముంబై: మహారాష్ట్ర రాజధాని Mumbaiతో పాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం నాడు Enforcement Directorate అధికారులు Raids నిర్వహిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ Dawood Ibrahim కు వ్యతిరేకంగా నమోదైన Money Laundering కేసులో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్రకు చెందిన ఓ రాజకీయ నాయకుడిపై కూడా ఈడీ అధికారులు నిఘా ఉంచారనే ప్రచారం సాగుతుంది. ఈ సోదాల్లో భాగంగా దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ ఇంట్లో కూడా సోదాలు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ నెట్ వర్క్ ఉగ్రవాద కార్యకలాపాలను పెంచిపోషిస్తుందని నిఘా వర్గాలు గుర్తించాయి.
ఈ నెల మొదట్లో అబూ బకర్ ను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి.1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్ల కేసుల్లో అబూ బకర్ నిందితుడిగా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీంకు అబూ బకర్ సన్నిహితుడిగా పోలీసులు చెబుతున్నారు. 29 ఏళ్ల తర్వాత అబూ బకర్ యూఏఈలో నిఘా వర్గాలకు పట్టుబడ్డాడు.
ముంబై పోలీస్ శాఖలో పనిచేసిన కానిస్టేబుట్ కొడుకే దావూద్ ఇబ్రహీం. ముంబైలోని డోంగ్రీ గ్యాంగ్ వార్‌తో దావూద్ ఇబ్రహీం నేర చరిత్ర 1980లో ప్రారంభమైంది. తొలుత ఓ దోపీడీ కేసులో దావూద్ ఇబ్రహీం పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత దావూద్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.