
లక్నో : Assembly elections నేపథ్యంలో అధికార BJP candidateకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న Lucknow రేంజ్ ఐజీ లక్ష్మి సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర Election Commission కు సమాజవాది పార్టీ ఫిర్యాదు చేసింది. లక్నో ఐ జి లక్ష్మీ సింగ్ భర్త, మాజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజేశ్వర్ సింగ్ లక్నోలోని సరోజినీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లక్నో రేంజ్ ఐజి లక్ష్మి సింగ్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ సమాజ్వాది పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
తన భర్త అయిన బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇది ఎన్నికలను ప్రభావితం చేస్తుందని సమాజ్ వాది పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై మొదట ఫిబ్రవరి 7న ఫిర్యాదు చేసి, మళ్లీ ఫిబ్రవరి 11న ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఎస్పీ నేతలు తెలిపారు.
కాగా, రెండో దశ అసెంబ్లీ ఎన్నికలలో Uttarpradesh లోని 55 నియోజకవర్గాలతో పాటు గోవా, ఉత్తరాఖండ్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14, సోమవారం ఓటింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. goa, Uttarakhandలలో ముఖ్యమంత్రులు ప్రమోద్ సావంత్, పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో జైలులో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలు ప్రముఖంగా ఉన్నారు.
కాగా, ఈ ఎన్నికల మీద యూపీ ముఖ్యమంత్రి Yogi Adityanathమాట్లాడుతూ.. ఇది 80 వర్సెస్ 20 ఎన్నికలని, యూపీలో బీజేపీ 300 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల 'thoko raaj' ఆరోపణపై యూపీ ముఖ్యమంత్రి స్పందిస్తూ, “ప్రజా భద్రతకు ముప్పు కలిగించే ప్రతి వ్యక్తి చట్టానికి భయపడాలి. 2017కి ముందు, ప్రతి 3-4 రోజులకు అల్లర్లు జరిగాయి, నెలల తరబడి కర్ఫ్యూ అమలులో ఉంది. దీనికి విరుద్ధంగా, గత 5 సంవత్సరాలలో ఎటువంటి అల్లర్లు, కర్ఫ్యూ జరగలేదు అన్నారు.
'80 vs 20 రిమార్క్' గురించి యోగి ఆధిత్యానాథ్ మరింత వివరిస్తూ... "ఇది చర్యకు ప్రతిస్పందన. 80 శాతం మంది బీజేపీతో ఉన్నారని, 20 శాతం మంది ఎప్పుడూ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని, ఈసారి కూడా అలాగే చేస్తారని చెప్పాను. నేను మతం లేదా కులం ప్రాతిపదికన చెప్పలేదు. 80 శాతం మంది భద్రత, అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ ఎజెండాతో సంతోషంగా ఉన్నవారు ఉన్నారు... అంటూ చెప్పుకొచ్చారు.
“20 శాతం మందిలో ప్రతికూల మనస్తత్వం ఉన్నవారు ఉంటారు, వారు ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తారు. మాఫియాలు, నేరస్థులకు మద్దతు ఇస్తారు. మొదటి దశ ఎన్నికల తర్వాత, ఈ ఎన్నికలు నిజంగా 80 వర్సెస్ 20 అని స్పష్టమైంది. బిజెపికి 80 శాతానికి పైగా ప్రజల నుండి మద్దతు లభించింది, ”అని యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.