బంగారం స్మగ్లింగ్: జ్యువెల్లరీ వ్యాపారి సంజయ్‌కుమార్ అరెస్ట్

By narsimha lodeFirst Published Nov 29, 2021, 9:37 PM IST
Highlights

బంగారం వ్యాపారి సంజయ్ కుమార్ ను సోమవారం నాడు   ఈడీ అధికారులు అరెస్ట్ చేసి కోల్‌కత్తా  కోర్టులో హాజరుపర్చారు.  కోర్టు అనుమతితో సంజయ కుమార్ ను 7 రోజుల కస్టడీకి తీసకొన్నారు ఈడీ అధికారులు. 


న్యూఢిల్లీ: పన్ను లేకుండా బంగారం అక్రమంగా చలామణి చలామణి చేశారన ఆరోపణలతో  ప్రముఖ బంగారం వ్యాపారి  సంజయ్ కుమార్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ లో సంజయ్ కుమార్ కు బంగారం వ్యాపారాలున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో Sanjay Kumar ను అరెస్ట్ చేసిkolkata  కోర్టులో హాజరు పర్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఏడు రోజుల పాటు సంజయ్ కుమార్ ను Enforcement Directorate  అధికారులు కస్టడీలోకి తీసుకొన్నారు.

Ghanshyamdas Gems, Jewelsయజమాని సంజయ్ కుమార్ . ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు సంజయ్ కుమార్ తనయుడు  ప్రీత్ కుమార్ అగర్వాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.సంజయ్ కుమార్ పై డీఆర్ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.ఈ ఏడాది మార్చి మాసంలో రూ. 100 కోట్ల బంగారం స్మగ్లింగ్ చేశారనే ఆరోపణలతో ప్రీత్ కుమార్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.  సుమారు 250 కిలోల బంగారం స్మగ్లింగ్ చేశారని ఈడీ  ప్రీత్ కుమార్ ను అరెస్ట్ చేసింది. కోల్‌కత్తాకు చెందిన ఈడీ అధికారులు హైద్రాబాద్ లోని ప్రీత్ కుమార్ కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే  కోణంలో కూడా ఈడీ అధికారులు విచారణ చేశారు. గతంలో కొడుకును అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇవాళ తండ్రి సంజయ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు. సంజయ్ కుమార్ ను ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ఎంఎంటీసీ, స్టేట్ ట్రేడింగ్ కార్పోరేషన్ నుండి పన్ను లేని బంగారాన్ని సంజయ్ కుమార్ సేకరించినట్టుగా  ఈడీ ఆరోపిస్తోంది.
 

click me!