Sonia Gandhi-Rahul Gandhi: సోనియా, రాహుల్ గాంధీ లపై ఈడీ సంచలన ఆరోపణలు

Published : May 21, 2025, 02:07 PM ISTUpdated : May 21, 2025, 02:08 PM IST
sonia gandhi

సారాంశం

నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.142 కోట్లు లాభపడ్డారంటూ సోనియా, రాహుల్‌పై ఈడీ ఆరోపణలు చేసింది. ఢిల్లీలో విచారణ సందర్భంగా కొత్త వాదనలు వినిపించాయి.

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో జరిగిన తాజా విచారణ సందర్భంగా ఈడీ చేసిన వాదనల ప్రకారం, ఈ ఇద్దరు నేతలు రూ.142 కోట్లను లబ్ధి పొందారని తెలిపింది.

ఈడీ అభిప్రాయపడిన ప్రకారం, నేరపూరిత మార్గాల్లో ఆస్తులను సమకూర్చి, అవే ధోరణిలో తిరిగి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. ఇది ఒక్కసారిగా జరిగిన చర్య కాదని, పద్ధతిగా ఇదే పంథాను కొనసాగించారని ఈడీ తెలిపింది.

ఇకపోతే, నేషనల్ హెరాల్డ్‌తో పాటు దానికి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో సీబీఐ దర్యాప్తు మధ్యలో నిలిచినా, ఈడీ మాత్రం తన విచారణను కొనసాగిస్తూనే ఉంది. 2023 నవంబరులో ఏజేఎల్‌కి చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

ఆ డబ్బును కేంద్రానికి..

ఈ ఆస్తుల స్వాధీన ప్రక్రియ కూడా మొదలైంది. ఢిల్లీ, ముంబయి, లఖ్‌నవూ ప్రాంతాల్లో ఉన్న భవనాలపై నోటీసులు అంటించి, అక్కడ ఉంటున్నవారు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఈడీ సూచించింది. అద్దెకి ఉంటున్నవారు ఇకపై ఆ డబ్బును కేంద్రానికి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఈడీ పేర్కొన్న ప్రకారం, అక్రమ ఆస్తుల చెలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 8, నిబంధన 5(1) ప్రకారం ఈ చర్యలు చేపట్టబడ్డాయి. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ కూడా దాఖలై ఉంది. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ తరఫున ప్రాసిక్యూషన్ కంప్లయింట్ సమర్పించారు. దానికి సంబంధించిన విచారణ బుధవారం కొనసాగింది.

ఇక ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతల పేర్లు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో విదేశీ నిధుల వినియోగం, ఆస్తుల లావాదేవీలపై ఇప్పటికే పలు దర్యాప్తులు కొనసాగుతుండగా, ఈడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ కేసు మళ్లీ కేంద్రబిందువుగా మారడానికి దోహదపడినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!
Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu