Supreme Court: బెయిల్‌ ఇచ్చేందుకు ఏడాది పాటు జైల్లో ఉండాల్సిన అవసరం ఏముంది

Published : May 21, 2025, 10:24 AM IST
Supreme Court

సారాంశం

సుప్రీం కోర్టు బెయిల్ కోసం ఏడాది జైలు అవసరం లేదని స్పష్టం చేసింది. అన్వర్ ధేబార్ అనే వ్యాపారవేత్త మనీల్యాండరింగ్ కేసు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

బెయిల్‌ వ్యవహారాలకు సంబంధించి సుప్రీం కోర్టు షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌ కోసం సంవత్సరం పాటు జైలు ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అసలు సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు ఎందుకు చేసిందంటే..గత సంవత్సరం అన్వర్‌ ధేబార్‌ అనే బిజినెస్‌ మ్యాన్‌ రూ.2 వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయ్యారు.

బెయిల్‌ ఇవ్వకూడదని..

ఈ కేసుకు సంబధించిన బెయిల్‌ పిటిషన్‌ మంగళవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అన్వర్‌ అరెస్ట్‌ అయ్యి సంవత్సరం కూడా కాలేదు. దీంతో దీనిని కారణంగా చూపిస్తూ ఆయనకు బెయిల్‌ ఇవ్వకూడదని ఈడీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కొన్ని కేసుల్లో బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ఏడాది కస్టడీ బెంచ్‌ మార్క్‌ ను అనుసరిస్తోందని పేర్కొన్నారు.

ఈ కేసులో కూడా ఇదే విధానాన్ని పాటించాలని అన్నారు.అన్వర్‌ కు రాజకీయంగా మంచి పలుకుబడి ఉండడంతో . ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తే తమ విచారణకు ఆటంకం కలిగే ఛాన్స్‌ ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది.ఈ కేసులో సుమారు 450 మంది సాక్షులున్నట్లు తెలిపారు.కానీ ఇప్పటి వరకు మాత్రం కేవలం 40 మంది దర్యాప్తు మాత్రమే జరిగింది. దీంతో విచారణ త్వరలో ముగిసేలా కనిపించడం లేదు.

9 నెలల పాటు జైలు జీవితాన్ని..

విచారణ ఇంకా కొనసాగుతోంది. దీని పై శిక్షా కాలం గరిష్ఠంగా ఏడేళ్లు.ఇప్పటికే పిటిషనర్‌ 9 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపేశారు.బెయిల్ తీసుకునేందుకు కచ్చితంగా జైల్లో గడపాల్సిన అవసరం లేదని ''సుప్రీం ధర్మాసనం తెలిపింది. ప్రత్యేక కోర్టు పెట్టిన కఠిన షరతులు, రూల్స్‌కు కట్టుబడి వ్యాపారవేత్తను వారం రోజుల్లోగా బెయిల్‌పై విడుదల చేయాలని దిగువ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?