ప్రధాని మోడీపై కామెంట్లు.. ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు

By Mahesh K  |  First Published Nov 14, 2023, 10:13 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఆప్ అఫీషియల్ హ్యాండిల్ ఎక్స్‌లో చేసిన పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌కు షోకాజ్ నోటీసులు పంపింది.
 


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా, ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు పంపింది. ప్రభుత్వ రంగ సంస్థలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తున్నారని మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడారని, ఇవి నిర్హేతుకమైనవని, అవాస్తవాలని బీజేపీ నవంబర్ 10వ తేదీన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ ప్రియాంక గాంధీకి షోకాజ్ నోటీసులు పంపింది. గురువారం రాత్రి 8 గంటల లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అలాగే.. అదే బీజేపీ నేతల బృందం అరవింద్ కేజ్రీవాల్ పైనా ఫిర్యాదు చేసింది. ఒక వీడియో క్లిప్, రెండు పోస్టులను ఎక్స్‌లో ఆప్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్టు చేసిందని, ఈ పోస్టులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని, అనైతికమైనవని ఆరోపణలు చేసింది. ప్రధానమంత్రి మోడీని టార్గెట్ చేసుకుని ఆ రిమార్కులు ఉన్నాయని పేర్కొంది.

Latest Videos

Also Read: గంగుల గురించి తెలిసే ఒవైసీ వద్ద కేసీఆర్ మోకరిల్లాడు: బండి సంజయ్ సంచలన ఆరోపణలు

దీంతో ఈసీ అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా షోకాజ్ నోటీసులు పంపింది. మోడీని టార్గెట్ చేసుకుంటూ ఆప్ అఫీషియల్ హ్యాండిల్ చేసిన పోస్టులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మోడల్ కోడ్ ఉల్లంఘన కింద ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదే వివరించాలని నోటీసులు పంపింది. ఒక వేళ నిర్దిష్ట సమయంలోనూ సమాధానం రాకుంటే కేజ్రీవాల్ వద్ద వివరణ లేదని భావించి తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది.

click me!