253 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్.. జాబితాలో కేఏ పాల్ పార్టీ..

By Sumanth KanukulaFirst Published Sep 14, 2022, 11:30 AM IST
Highlights

ఉనికిలో లేని 86 గుర్తింపు లేని రాజకీయ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించింది. మరో 253 నమోదిత గుర్తింపు లేని పార్టీలను కూడా క్రియారహితంగా (inactive) ప్రకటించింది.

ఉనికిలో లేని 86 గుర్తింపు లేని రాజకీయ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించింది. మరో 253 నమోదిత గుర్తింపు లేని పార్టీలను కూడా క్రియారహితంగా (inactive) ప్రకటించింది. పార్టీ పరమైన ప్రయోజనాలు పొందకుండా నిషేధం విధించింది. ఒక ప్రకటనలో, ఎన్నికల ప్రజాస్వామ్యం స్వచ్ఛత కోసం, విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘంపేర్కొంది. అందువల్లే ఈ చర్య తీసుకుంటున్నట్టుగా తెలిపింది. ఎన్నికల చిహ్నాల ఉత్తర్వు- 1968 ప్రకారం.. ఈ పార్టీలు ఎలాంటి ప్రయోజనం పొందకుండా కూడా కమిషన్ నిషేధించింది. 

ఇక, ఈ రెండు జాబితాలో ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 16 పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి ఆల్ ఇండియా ముత్తాహిత ఖ్వామీ మహజ్, ప్రజా భారత్ పార్టీ, మనపార్టీ, భారతదేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ది సేవాల సమూహం.. తెలంగాణ నుంచి సురాజ్ పార్టీ, సెక్యులర్ డెమొక్రటిక్ లేబర్ పార్టీ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. 

పార్టీ పరమైన ప్రయోజనాలు పొందకుండా నిషేధం విధించిన జాబితాలో తెలంగాణలో 14 పార్టీలు ఉన్నాయి. అందులో క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. ఈ జాబితాను చూస్తే.. ఆలిండియా ముత్తహిద్‌ ఖ్వామీ మహజ్, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, మనపార్టీ, నేషనలిస్టిక్ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజాభారత్ పార్టీ, ఆల్ ఇండియా ముక్తిదళ్ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, ప్రజా పార్టీ, సురాజ్ పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, యూత్ డెమొక్రటిక్ పార్టీ, ప్రజాశాంతి పార్టీలు ఉన్నాయి. 

ఇక, కమిషన్‌ ఆదేశాలతో ఏదైనా రాజకీయ పార్టీకి అసంతృప్తి ఉంటే.. 30 రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు లేదా ఎన్నికల కార్యాలయానికి సమాధానం ఇవ్వవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

click me!