మరో ఎన్నికల యుద్ధం: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

By sivanagaprasad KodatiFirst Published Nov 1, 2019, 4:43 PM IST
Highlights

దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది.     

దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సునీల్ ఆరోరా షెడ్యూల్‌ను విడుదల చేశారు. 81 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని సునీల్ తెలిపారు.

మొత్తం ఐదు విడతల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న తొలి విడత, డిసెంబర్ 7న రెండో విడత, డిసెంబర్ 12న మూడో విడత, డిసెంబర్ 16న నాలుగవ విడత, డిసెంబర్ 20న ఐదో విడత పోలింగ్ జరగనుంది... డిసెంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సునీల్ ఆరోరా వెల్లడించారు. 

జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 37 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 5 సీట్లు గెలుచుకుంది. మొత్తం 82 సీట్లలో అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ దాటడంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Also Read:శివసేనకు కాంగ్రెస్ ఆఫర్: "పులి గడ్డి తింటుందా?"అంటూ బీజేపీ ఫైర్

రఘువర్ దాస్ 2014 డిసెంబర్ 28న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్‌లో మొత్తం 2.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 67 నియోజకవర్గాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలే. 2000లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జార్ఖండ్ నాలుగోసారి ఎన్నికలకు వెళ్లనుంది.

కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. హర్యానాలో ఇండిపెండెంట్లు, జేజేపీ మద్ధతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. సీఎం కుర్చీ నీదా నాదా సై అన్న చందంగా అటు బీజేపీ ఇటు శివసేన పార్టీలు రాజకీయంగా కొట్లాటకు తెరలేపాయి. దాంతో మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. 

ఇకపోతే ఛాన్స్ వస్తే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కాంగ్రెస్, ఎన్సీపీ సైతం అవకాశం కోసం కాచుకు కూర్చోంది. సీఎం కుర్చీపై పీఠముడి వీడకపోవడం అటు ఉంచితే రాష్ట్రాన్ని అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. 

రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఏ పార్టీ పట్టించుకోకపోవడంతో రైతులు విసుగుచెందుతున్నారు. ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ విష్ణు గడలే అనే రైతు ప్రత్యామ్నాయ మార్గం సూచిస్తూ మహారాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశాడు. 

భాగస్వామ పార్టీల మధ్య కొట్లాట ముగిసి విభేదాలు పరిష్కారమయ్యేంత వరకూ తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్‌కు లేఖ రాశారు. తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను కోరారు.

Also Read:ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇవ్వండి, పాలించి చూపిస్తా: మహారాష్ట్ర గవర్నర్ కు రైతు లేఖ

ఇకపోతే ఆగస్టులో కురిసిన వర్షాలకు పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయని, తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణం పనిచేసే ప్రభుత్వం కావాలని ఆ లేఖలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు రైతు.  

అకాల వర్షాలు రాష్ట్రంలో కోతకు సిద్ధంగా ఉన్న పంటలను తుడిచిపెట్టేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వారికి అండగా నిలవాల్సిన సమయంలో సీఎం కుర్చీ విషయంలో బీజేపీ-శివసేన ఎటూ తేల్చుకోలుకుండా ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. 

సీఎం కుర్చీపై పీఠముడి వీడేవరకు సీఎం పదవి తనకు ఇవ్వాలంటూ గవర్నర్ కు సలహా ఇచ్చాడు రైతు శ్రీకాంత్ విష్ణు గడలే. రైతుల సమస్యలను ఒక రైతుగా తానే పరిష్కరిస్తానని నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తానని లేఖలో పేర్కొన్నారు.  

ఇకపోతే మహారాష్ట్రలో అక్టోబర్ 21న అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే సీఎం పీఠం ఎవరిదీ అనేదానిపై ఇంకా తేలలేదు. సీఎం కుర్చీపై బీజేపీ-శివసేనల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.  

click me!