నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మార్చి 2న కౌంటింగ్.. పూర్తి వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Jan 18, 2023, 3:14 PM IST
Highlights

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది.

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఫిబ్రవరి 27 పోలింగ్ జరగనున్నట్టుగా తెలిపింది. మార్చి 2వ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.  త్రిపురలో బీజేపీ అధికారంలో ఉండగా, మేఘాలయా, నాగాలాండ్‌లలో సంకీర్ణ ప్రభుత్వాలలో బీజేపీ భాగంగా ఉంది. నాగాలాండ్ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మార్చి 12న, మేఘాలయ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మార్చి 15న, త్రిపుర ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మార్చి 22న ముగుస్తుంది.


ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం మూడు ఈశాన్య రాష్ట్రాల్లో (త్రిపుర, మేఘలయ, నాగాలాండ్) పర్యటించిన తర్వాత గత వారం వరుస సమావేశాలు జరిగాయి. ఈ చర్చలకు మూడు రాష్ట్రాల రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర భద్రతా అధికారులు హాజరయ్యారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు 2023..
గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: జనవరి 21
నామినేషన్లకు చివరి తేదీ: జనవరి 30
నామినేషన్ల పరిశీలన తేదీ: జనవరి 31
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 2
ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 16
కౌంటింగ్ తేదీ: మార్చి 2

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు 2023..
గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: జనవరి 31
నామినేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 7
నామినేషన్ల పరిశీలన తేదీ: ఫిబ్రవరి 8
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 10
ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 27
కౌంటింగ్ తేదీ: మార్చి 2

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు 2023..
గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: జనవరి 31
నామినేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 7
నామినేషన్ల పరిశీలన తేదీ: ఫిబ్రవరి 8
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 10
ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 27
కౌంటింగ్ తేదీ: మార్చి 2

click me!