ఢిల్లీలో మళ్లీ భూప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం

By Siva KodatiFirst Published Nov 12, 2022, 8:20 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. 4 రోజుల వ్యవధిలో భూమి మళ్లీ కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. ఒక్కసారిగా ఇంట్లోని తలుపులు, కిటికీలు, సామానులు ఊగడంతో జనం ప్రాణభయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. 4 రోజుల వ్యవధిలో భూమి మళ్లీ కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే..  ఢిల్లీలో బుధవారం తెల్లవారు జామున 1.58 నిమిషాలకు ఒక్క సారిగా భూమి కంపించింది. ఢిల్లీతో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భూమి ప్రకంపనలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. చాలా మందికి ఏమీ అర్థం కాక, భద్రత కోసం అర్ధరాత్రి ఇళ్ల నుండి బయటకు వచ్చారు.

Also REad:నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. ఆరుగురు దుర్మరణం.. భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు..

కొన్ని సెకన్ల పాటు ఈ తీవ్రమైన భూకంపం కొనసాగింది. దీని ప్రకంపనలు పొరుగున ఉన్న నోయిడా, గురుగ్రామ్లో కూడా కనిపించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపం లోతు సుమారు 10 కిలో మీటర్ల రేంజ్ లో ఉంది. ‘‘ 09.11.2022న నేపాల్ కేంద్రంగా భూకంపం   01:57:24 సమయంలో సంభవించింది. దీని తీవ్రత 6.3గా నమోదు అయ్యింది. లాట్: 29.24, పొడవు : 81.06, లోతు : 10 కిలో మీటర్లు’’ అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది.

click me!