న్యూఢిల్లీలో భూప్రంకపనలు:భయంతో జనం పరుగులు

By narsimha lode  |  First Published Nov 6, 2023, 4:34 PM IST

వారం రోజుల వ్యవధిలో న్యూఢిల్లీ వాసులు మరోసారి  భయకంపితులయ్యారు.  వరుసగా భూప్రంకపనలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


న్యూఢిల్లీ: న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో సోమవారంనాడు  మధ్యాహ్నం  భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.దీంతో  ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంప తీవ్రత  రిక్టర్ స్కేల్ పై  5.6 గా నమోదైంది.  మూడు రోజుల క్రితం  నేపాల్ లో  6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.  దీంతో  150 మందికి పైగా మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యకు ఉత్తరాన 233 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

భూకంపం కారణంగా  ఢిల్లీ వాసులు  భయంతో  తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.ఈ విషయమై పలువురు  సోషల్ మీడియాలో వీడియోలను పోస్టు చేశారు.ఈ నెల 3న  నేపాల్ లో  6.4 తీవ్రతతో  భూకంపం చోటు చేసుకుంది. 2015 నుండి సంభవించిన  భూకంపాల్లో  అత్యంత  పెద్దదైన భూకంపంగా శాస్త్రవేత్తలుగ పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత చురుకైన టెక్టోనిక్ జోన్ లలో  ఒకటిగా  ఉంది. దీంతో నేపాల్ లో  తరచూ భూకంపాలు  చోటు చేసుకుంటున్నాయి.

Latest Videos

undefined

ఈ నెల 3న జరిగిన భూకంపంలో జాజర్ కోట్, రుకుమ్ వెస్ట్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.జాజర్ కోట్ లోనే  సుమారు 105 మంది మృతి చెందారు. రుకుమ్ వెస్ట్ లో  52 మంది మృతి చెందారు.వందలాది మంది గాయపడ్డారు.
 

 

click me!