మహిళా ఆఫీసర్ హత్య కేసులో డ్రైవర్ అరెస్టు.. ఉద్యోగంలో నుంచి తొలగించందుకే దారుణం ?

By Asianet News  |  First Published Nov 6, 2023, 1:40 PM IST

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగి హత్యకు గురయ్యారు. అయితే ఈ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఉద్యోగంలో నుంచి తొలగించారనే కారణంతో ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


కర్ణాటకలో సీనియర్ ప్రభుత్వ అధికారిణి కేఎస్ ప్రతిమ హత్యకేసులో నిందితుడిని బెంగళూరు పోలీసులు సోమవారం కిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే అతడిని కొంత కాలం కిందట ప్రతిమ సర్వీసు నుంచి తొలగించారు. ఈ కారణంతోనే ఆమెను డ్రైవర్ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మోదీ నుండి యోగి వరకు... బిజెపి అగ్ర నాయకత్వమంతా తెలంగాణలోనే... క్యాంపెనర్ల లిస్టిదే..

Latest Videos

హత్య అనంతరం నిందితుడు రాష్ట్రంలోని చామ్‌రాజ్‌నగర్‌ జిల్లాకు పారిపోయాడని, సోమవారం అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు పోలీస్ కమీషనర్ బి దయానంద్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిమ హత్య కేసుకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాం. డీసీపీ సౌత్ (బెంగళూరు) నేతృత్వంలో ఆపరేషన్ జరిపి, నిందితుడిని మలే మహదేశ్వర కొండల సమీపంలో అరెస్టు చేశాం. నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 7-10 రోజుల ముందు ప్రతిమ అతడిని ఉద్యోగం నుంచి తొలగించి ఉంటారు ’’ అని పేర్కొన్నారు.

అమ్మవారిని పూజించి... అమ్మ ఆశిస్సులు పొంది..: నామినేషన్ వేసేందుకు బయలుదేరిన బండి సంజయ్ (వీడియో)

కాగా.. ప్రతిమ అంటే ఆమె కుటుంబ సబ్యులకు ఎంతో గౌరవం. ఆమెను ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఉద్యోగం ధర్మంఅంకితభావంతో నిర్వహిస్తూ గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆమె కొన్ని ప్రదేశాలపై రైడ్ చేశారు. కానీ ఆమెకు ఎవరూ శత్రువులు లేరు. నిబంధనల ప్రకారం ఆమె తన విధులు నిర్వహించారు. అందుకే డిపార్ట్ మెంట్ లో ఆమెకు మంచి పేరు ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

annaram barrage : ఖాళీ అవుతున్న అన్నారం బ్యారేజీ.. 10 రోజులుగా గేట్లు ఎత్తి నీటి విడుదల

కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల కేఎస్ ప్రతిమ ఆదివారం హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన నివాసంలో దారుణంగా కత్తిపోట్లకు గురై, చనిపోయారు. శివమొగ్గలో ఎంఎస్సీ పట్టా పొందిన ప్రతిమ.. ఏడాదిన్నరగా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. అంతకు ముందు రామనగరలో విధులు నిర్వహించారు.
 

click me!