న్యూఢిల్లీలో భూకంపం: భయంతో పరుగులు తీసిన ప్రజలు

By narsimha lodeFirst Published Jan 24, 2023, 2:49 PM IST
Highlights


న్యూఢిల్లీలో పలు ప్రాంతాల్లో  మంగళవారం నాడు  భూకంపం వాటిల్లింది.  ఈ భూకంపం కారణంగా  ప్రజలు భయాందోళనలు  వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని  ఢిల్లీతో పాటు  చుట్టుపక్కల ప్రాంతాల్లో  మంగళవారంనాడు  భూకంపం సంభవించింది.   ఇప్పటివరకు  ఎలాంటి నష్టం జరిగిందని  అధికారికంగా సమాచారం అందలేదు.   భూకంపం కారణంగా  ప్రజలు ఇళ్ల నుండి  భయంతో పరుగులు తీశారు.భూకంపం కారణంగా  ప్రజలు ఇళ్ల నుండి  భయంతో పరుగులు తీశారు. నేపాల్ లోని జుమ్లాకు వాయువ్యంగా  63 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా  అధికారులు గుర్తించారు. 

రిక్టర్ స్కేల్ పై  భూకంప తీవ్రత  5.8  గా నమోదైంది.  ఢిల్లీ సహా  పరిసర ప్రాంతాల్లో భూకంపం సంబవించిందని అధికారులు నిర్ధారించారు. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో  భూకంపం సంబవించిందని  అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎన్‌సీఆర్  లోని  నిమిషం కంటే  తక్కువ వ్యవధిలో  భూమి కంపించిందని  స్థానికులు చెబుతున్నారు.ఈ భూకంపం కారణంగా  ఫ్యాన్లు , ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడిపోయాయి.,  భూకంపానికి సంబంధించిన వీడియోలను స్థానికులు  సోషల్ మీడియాలో పోస్టు  చేశారు. 

also read:ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు..

ఈ నెల  5వ తేదీన  ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజాబాద్ లో  భూకంపం వాటిల్లింది. దీని ప్రభావంతో  ఢిల్లీలో  కన్నించింది.  ఢిల్లీలోని ఎన్ సీ ఆర్  సహఆ  పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.  ఈ నెల  1న  హర్యానాలోని  ఝజ్జర్ లో 3.8 తీవ్రతతో భూకంపం వాటిల్లింది,  దీని ప్రభావం ఢిల్లీలో  కన్పించింది. ఢిల్లీలోని ఎన్ సీఆర్ లో ప్రకంపనలు వాటిల్లాయి.  

click me!