ఒకేసారి భారత్ తో పాటు చైనా, నేపాల్, భూటాన్ దేశాల్లో భూకంపం : 9 మంది మృతి

By Arun Kumar P  |  First Published Jan 7, 2025, 10:07 AM IST

భారత్ తో సహా పొరుగుదేశాలైనా చైనా, నేపాల్, భూటాన్ లలో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. ఇది ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టాన్ని కూాడా కలిగించింది. 


Earthquake : ఇటీవల కాలంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో గత డిసెంబర్ లోనే రెండుమూడు సార్లు భూమి కంపించి తెలుగు ప్రజలను భయకంపితులను చేసింది. ఇది మరిచిపోకముందే తాజాగా మరికొన్ని రాష్ట్రాల్లో భూకంపం చోటుచేసుకుంది. పొరుగుదేశాలు చైనా, నేపాాల్, భూటాన్ లలో కూడా భూమి కంపించింది. ఈ భూకంపం వల్ల సంబవించిన ప్రమాదాల్లో 9 మంది మృతిచెందారు. 

చైనాలోని పర్వత ప్రాంతంలో ఇవాళ(మంగళవారం) ఉదయం 6:35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత  7.1 గా వుంది. చైనాలో భూకంప  తీవ్రత ఎక్కువగా వుండటంతో ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం సంభవించింది. మిగతా దేశాల్లో కేవలం భూమి కంపించింది.... ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  

Latest Videos

భూకంప కేంద్రం టిబెట్ లో వుంది...సుమారు 10 కిలోమీటర్ల (6 మైళ్ళు) లోతులో భూమి పొరల సర్దుబాటు వల్ల భూమి కంపించింది. ఇది టిబెట్ రాజధాని లాసా నుండి 380 కిలోమీటర్లు (240 మైళ్ళు), రెండవ అతిపెద్ద నగరం అయిన షిగట్సే నుండి సుమారు 23 కిలోమీటర్లు (14 మైళ్ళు) దూరంలో ఉంది. వీటికంటే చైనాకు దగ్గర్లో ఈ భూకంప కేంద్రం వుండటంతో అక్కడ ప్రభావం ఎక్కువగా వుంది. 

: టిబెట్‌లోని షిగట్సేలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు ప్రత్యక్ష సాక్షులు చిత్రీకరించిన వీడియో pic.twitter.com/bjFf0pRU26

— upuknews (@upuknews1)

ఈ భూకంపం ప్రభావం భారత్ తో పాటు నేపాల్ లో కూడా వుంది.  ఆ దేశ రాజధాని కాఠ్‌మాండులో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న మారుమూల, పర్వత ప్రాంతాల నుండి ఇంకా సమాచారం అందాల్సి వుంది. 

భారత్ లో భూకంపం సంభవించిన ప్రాంతాలు : 

భారత రాజధాని డిల్లీతో పాటు బీహార్  లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. పాట్నాతో పాటు బీహార్‌లోని పలు ప్రాంతాలు మరీముఖ్యంగా ఉత్తర బీహార్‌లో బలమైన భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూకంపం ప్రభావం కనిపించింది.

ఇవి కూడా చదవండి :

తెలుగు రాష్ట్రాల్లో పదేపదే భూకంపాలు ఎందుకు వస్తున్నాయి

 తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు వచ్చే ఛాన్స్ ఎంతుంది? హైదరాబాద్, విజయవాడ సేఫేనా?
 

click me!