మహారాష్ట్రలో భూకంపం: భయంతో పరుగులు తీసిన ప్రజలు

By Nagaraju penumalaFirst Published Jun 20, 2019, 10:58 AM IST
Highlights

ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో మహారాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

ముంబై: మహారాష్ట్రలో భూకంపంపం సంభవించింది. రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. ఉదయం 7.48 గంటలకు తొలిసారిగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.8గా నమోదైంది. ఆ తర్వాత 8.27గంటలకు మరోసారి భూమి కంపించింది. 

రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 3.0గా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో మహారాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

click me!