కెనాల్ లో వ్యాను బోల్తా.. 15మంది గల్లంతు

Published : Jun 20, 2019, 10:14 AM IST
కెనాల్ లో వ్యాను బోల్తా.. 15మంది గల్లంతు

సారాంశం

కెనాల్ లో వ్యాను బోల్తా పడి 15మంది గల్లంతైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.  ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ ఇందిరా కెనాల్‌లో పడిపోయింది

కెనాల్ లో వ్యాను బోల్తా పడి 15మంది గల్లంతైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.  ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ ఇందిరా కెనాల్‌లో పడిపోయింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సుమారు 15 నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఘటన పట్వాఖండా గ్రామం నాగ్‌రాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Plastic Currency: భారత మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి.. పాత కరెన్సీ నోట్ల సంగతేంటి?
పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డ‌కు గోల్డ్ రింగ్, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..