
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్)కి సమాచారం అందించింది. ఎన్‌సిఎస్ ప్రకారం, గ్వాలియర్‌లో ఉదయం 10:31 గంటలకు ఈ భూకంపం సంభవించింది.
భూకంపం తీవ్రత : 4.0
తేదీ : 24-03-2023
సమయం : 10:31:49 ఐఎస్ టి
లాటిట్యూడ్ : 26.01 & లాంగిట్యూడ్ : 78.35
లోతు : 10 కి.మీ.
స్థానం : 28కి.మీ. ఎస్ఈ ఆఫ్ గ్వాలియర్, మధ్యప్రదేశ్
అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది.
అర్జెంటీనాలో భారీ భూకంపం.. 6.5 తీవ్రత
శుక్రవారం రోజు తెల్లవారుజామున, మణిపూర్‌లోని మోయిరాంగ్‌లో రిక్టర్ స్కేల్‌పై భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ తెలిపింది. మొయిరాంగ్‌లో ఉదయం 8:52 గంటలకు భూకంపం సంభవించింది. అంతకుముందు మంగళవారం, ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు భూకంపాలను చవి చూశారు. ముందుజాగ్రత్త చర్యగా చాలా మంది ఇళ్లను వదిలేసి బహిరంగ ప్రదేశాలకు వచ్చారు.
ప్రకంపనల తర్వాత, ఢిల్లీ అగ్నిమాపక సేవకు జామియా నగర్, కల్కాజీ ప్రాంతం, షాహదారా ప్రాంతాల నుండి భవనాలు వాలిపోయాయని.. భవనాలలో పగుళ్లు కనిపించాయని కాల్స్ అందాయి. అయితే, భూకంపం కారణంగా భవనాల్లో ఎటువంటి వాలు కనిపించలేదని ఫైర్ సర్వీస్ అధికారులు ధృవీకరించారు.
"భూకంపం కారణంగా షకర్పూర్ ప్రాంతంలోని భవనం ఒరిగిపోవడానికి సంబంధించిన పీసీఆర్ కాల్ వచ్చింది. పోలీసులు, పీసీఆర్, అగ్నిమాపక దళం, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అక్కడ వారు పేర్కొన్న భవనంలో ఎలాంటి పగుళ్లు లేదా ఒరిగిపోవడం కనిపించలేదు. కాల్ చేసిన వ్యక్తికి భూకంపం వల్ల ఒరిగిపోయినట్టుగా అనుమానించి కాల్ చేసాడు," అని ఢిల్లీ పోలీసులు తెలిపారు