‘ముందున్నది ఆట’.. బెంగాల్‌లో ముందస్తు ఎన్నికలకు బీజేపీ సంకేతాలు

By Mahesh KFirst Published Dec 3, 2022, 3:40 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ సంకేతాలు ఇచ్చింది. టీఎంసీ ఖేలా హోబే నినాదాన్ని బీజేపీ వాడుకుంటూ ఈ సిగ్నల్స్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు గేమ్స్ ఆడతాయని, అది ప్రమాదకరంగా ఉంటుందని వివరించింది.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ సంకేతాలు ఇచ్చింది. మమతా బెనర్జీ పాపులర్ స్లోగన్ ఖేలా హోబే (ముందున్నది ఆట) ను బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంటూ ఈ కామెంట్ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు ఆటాడుకుంటాయని పేర్కొంది.

బీజేపీ అహింస సూత్రాన్నే నమ్ముతుందని వివరించింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అహింసనే నమ్ముతామని, కానీ, మమ్ముల్ని కూడా దాడికి పురికొల్పితే రియాక్ట్ కాక తప్పదని వివరించారు.

రెండు పార్టీలు త్వరలోనే ఆటాడతాయని పేర్కొన్నారు. అది మరింత ప్రమాదకరంగా ఉంటుందని బీజేపీ నేత నార్త్ 24 పరిగణాల జిల్లాలో బారాక్‌పోరర్‌లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: ' దమ్ముంటే.. సిఎఎ అమలు చేయకుండా ఆపండి'.. మమతా బెనర్జీకి బీజేపీ నేత బహిరంగ సవాలు

2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఖేలా హోబే అనే స్లోగన్‌ను హైలైట్ చేసింది. ఈ స్లోగన్ విపరీతంగా పాపులర్ అయింది. వెస్ట్ బెంగల్ బయట ఎన్నికల్లోనూ ఈ స్లోగన్ యూజ్ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌ను కొన్ని సంవత్సరాల్లో గద్దె దింపుతామని తాను హామీ ఇస్తున్నా అని సుకాంత మజుందార్ అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా వస్తాయని ఆయన సంకేతాలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్ సభ ఎన్నికలతోపాటే జరిగినా ఆశ్చర్యపోరాదని తెలిపారు.

2021లో తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

202 ఎన్నికల తర్వాత జరిగిన హింసపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కనీసం 300 మంది టీఎంసీ కార్యకర్తలు ప్రస్తుతం జైలులో ఉన్నారు.

click me!