వైరల్ : అర్థరాత్రి దానంతట అదే కదిలిన బైక్.. కారణమేంటంటే...

Published : Feb 02, 2021, 05:01 PM IST
వైరల్ : అర్థరాత్రి దానంతట అదే కదిలిన బైక్.. కారణమేంటంటే...

సారాంశం

గుజరాత్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిముందు పార్క్ చేసిన బైక్ దానంతటదే కదిలింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

గుజరాత్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిముందు పార్క్ చేసిన బైక్ దానంతటదే కదిలింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఓ వీధిలో అర్థరాత్రి ఓ ఇంటిముందు రెండు టూవీలర్లు పార్క్ చేసి ఉన్నాయి. వీటిల్లో ఓ టూ వీలర్ దానంతట అదే ముందుకు కదిలింది. ఇది సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. 30 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్ దానంతట అదే కదిలి ముందుకెళ్లి యూ టర్న్ తీసుకుంటూ కింద పడిపోయింది. 

అంబర్ జైదీ అనే మహిళ ట్విటర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది కెమెరాలో రికార్డయ్యింది కాబట్టి కానీ, మామూలుగా చెబితే ఎవ్వరూ నమ్ము అంటూ ఆమె పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిమీద నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక కామెంట్లు పెడుతున్నారు. 

కొంతమందైతే ఇది దయ్యం పనేనని, అదృశ్యశక్తులు ఉన్నాయని కూడా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఏం జరిగింది, బైక్ కదలడానికి కారణాలేమిటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word