తాగిన మత్తులో కారు అద్దాలు పగులగొట్టి.. ఎయిర్ హోస్టెస్ హల్ చల్.. ఐదుగురి అరెస్ట్..

By Bukka SumabalaFirst Published Aug 13, 2022, 9:48 AM IST
Highlights

ఓ ఎయిర్ హోస్టెస్ తాగిన మత్తులో తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్లో ఓ కుటుంబంతో గొడవకు దిగింది. దీంతో ఆమెతో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జైపూర్ : జైపూర్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. ఓ ఎయిర్ హోస్టెస్, ఆమె ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో గొడవకు దిగారు. దీంతో ఆమెతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రాచీ సింగ్ , ఆమె స్నేహితులు బుధవారం ఓ రెస్టారెంట్‌లో ఒక కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. అది అక్కడితో అయిపోలేదు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎయిర్ హోస్టెస్ బీరు బాటిల్‌తో వాగ్వాదానికి దిగిన కుటుంబానికి చెందిన కారు అద్దాన్ని పగలగొట్టింది.

దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సింగ్, ఆమె భర్త కార్తీక్ చౌదరి, వికాస్ ఖండేల్వాల్, నేహాలపై కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారు బెయిల్‌పై బయటికి వచ్చారు" అని సింధీ క్యాంప్ SHO గుంజన్ సోనీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ప్రాచీ సింగ్ తో గొడవకు దిగిన వర్గానికి చెందిన విశాల్ దూబే, ఆర్యలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారు కూడా బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వారు తెలిపారు.

CPM state meet: ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. కేంద్రంపై కేర‌ళ సీఎం ఫైర్

ఇదిలా ఉండగా,  విమానంలో స్మోకింగ్ వీడియో మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ లో 6.30 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న బాబీ కటారియా అనే గుర్గావ్ నివాసి ఈ ఆకతాయి చర్యకు పాల్పడ్డాడు. స్పైస్ విమానంలో వెలుగు చూసిన ఈ ఘటనపై డీజీసీఏ విస్మయం వ్యక్తం చేసింది. నిందితుడు బాబీ కటారియాపై వెంటనే కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా నిందితుడు విమానంలో సీటుపై దర్జాగా పడుకుని సిగరెట్ కాల్చుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. లైటర్ వెలిగించి సిగరెట్ కాల్చడు. వీడియో కట్ అవడానికి ముందు రెండు సార్లు పొగ ఊదడం కూడా వీడియోలో కనిపించింది.

ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాబీ కటారియాకు శిక్ష ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య  సింధియాకు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు. ‘విచారణ జరుగుతోంది. ఇలాంటి హానికరమైన ఘటన విషయంలో ఉపేక్షించేదే లేదు’ అని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అయితే ఇది పాత వీడియోగా తమ దృష్టికి వచ్చినట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ  ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని, తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై  నిందితుడు బాబీ కటారియా తనని తాను సమర్ధించుకున్నాడు. న్యూస్ రిపోర్టర్ల స్క్రీన్ షాట్ లను తన ఇన్ స్టా వాల్ పై పోస్టు చేశాడు. టీఆర్పీ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మీడియా పై నిందలు వేసే ప్రయత్నం చేశాడు. విమానాల్లో ధూమపానం ప్యాసింజర్లకు అసౌకర్యంతో పాటు అత్యంత ప్రమాదకరం. భారత్లో విమానాల్లో ధూమపానం నిషేధించబడింది. కాగా గతంలో కూడా నిందితుడు కటారియా నడిరోడ్డుపై కూర్చుని మద్యం సేవించినందుకు అతడిపై ఒక కేసు నమోదయ్యింది. 

click me!