Arvind Kejriwal: "యువతకు ఉపాధి కల్పిస్తాం, మజ్ను కా తిలా, చాందినీ చౌక్‌లను Food Hubsగా మారుస్తాం" 

Published : Jul 24, 2022, 03:12 PM IST
Arvind Kejriwal: "యువతకు ఉపాధి కల్పిస్తాం, మజ్ను కా తిలా, చాందినీ చౌక్‌లను Food Hubsగా మారుస్తాం" 

సారాంశం

Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో ఫుడ్ హబ్‌ను కూడా విస్తరిస్తామని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అలాగే.. ఢిల్లీలోని 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని, మజ్ను కా తిలా, చాందినీ చౌక్‌లను ఫుడ్ హబ్‌గా మారుస్తామని సీఎం కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: దేశ‌ రాజధాని ఢిల్లీని అభివృద్ధి చేస్తామనీ, రానున్న ఐదేళ్లలో తమ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాగే ఢిల్లీలోని మజ్ను కా తిలా, చాందినీ చౌక్‌లను ఫుడ్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఢిల్లీ ఫుడ్ హబ్‌ను కూడా విస్తరిస్తామని చెప్పారు.

ప్రస్తుతం నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఢిల్లీలో కూడా చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా 12-13 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఢిల్లీని భారత ఆహార రాజధానిగా పరిగణిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ప్రపంచం నలుమూలల ల‌భించే  అన్ని రకాల ఆహారాలు ఢిల్లీలో లభించేలా చేస్తామ‌ని అన్నారు. ఢిల్లీలోని అన్ని ఫుడ్ హబ్‌లు అభివృద్ధి చెందుతాయనీ, వాటిని అభివృద్ధి చేసేందుకు త‌మ దగ్గర ప్రణాళిక ఉందనీ, వారికి భౌతిక మౌలిక సదుపాయాలను సరిచేస్తామ‌నీ, ఆపై ఆహార భద్రతకు ఏర్పాట్లు చేస్తామ‌నీ. దీని తరువాత.. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వచ్చేలా ఆ ఫుడ్ హబ్ బ్రాండ్ చేయబడుతుందని అన్నారు.  

దేశ రాజధానిలోని చాందినీ చౌక్ మరియు మజ్ను కా తిలా ప్రాంతాలను ఫుడ్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని డిస్పెన్సేషన్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నగరాన్ని ఫుడ్ క్యాపిటల్‌గా ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ఇప్పటికే ఫుడ్ క్యాపిటల్‌గా ప్రసిద్ధి చెందిందని, అందువల్ల ఈ ప్రాంతాలను ఫుడ్ హబ్‌లుగా అభివృద్ధి చేయడంతో నగరం దాని పేరుకు తగ్గట్టుగా ఉంటుందని ఆయన అన్నారు .
 
కేజ్రీవాల్ ఇక‌ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో వివిధ రకాల ఫుడ్ హబ్‌లు ఉన్నాయని, ఇవి విభిన్న వంటకాలను అందించడానికి ప్రసిద్ధి చెందాయని చెప్పారు. మొదటి దశలో..  ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు ఇష్టమైన ప్రదేశం అయిన మజ్ను కా తిలా,  చాందినీ చౌక్, ఫుడ్ హబ్‌లను అభివృద్ధి చేస్తామనీ, త‌రువాత‌ ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామ‌ని అన్నారాయన.
  
వాస్త‌వానికి ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 2018లో ఆమోదించబడింది. డిసెంబర్ 2018లో పని ప్రారంభమైంది. ఇది మార్చి 2020 నాటికి పూర్తి కావాల్సి ఉంది, కానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. దాని గడువు డిసెంబర్ 2020కి వాయిదా పడింది. మ‌రోసారి కరోనా విభృంభించ‌డంతో మ‌రోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 2021లో ప్రారంభోత్సవం చేయాల‌ని భావించారు. కానీ కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా ఈవెంట్ మళ్లీ రద్దు చేయబడింది. కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న‌తో తిరిగి మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది.  

ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు

ఇదిలా ఉంటే.. మంకీపాక్స్‌పై అరవింద్ కేజ్రీవాల్: ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగులోకి రావడంతో ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ క్ర‌మంలో భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంకీపాక్స్ సోకిన రోగి నిలకడగా ఉన్నాడని, కోలుకుంటున్నాడని ఢిల్లీ సీఎం తెలిపారు. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఎల్‌ఎన్‌జేపీలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. మంకీపాక్స్ గురించి ఢిల్లీవాసులు ఆందోళ‌న చెంద‌కుండా.. నిరోధించడానికి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఢిల్లీలో మొట్టమొదటి మంకీపాక్స్ వ్యాధి వెలుగులోకి వచ్చింది.  

ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. రోగికి ప్రయాణ చరిత్ర కూడా లేదనీ, దేశంలో ఇది నాలుగో  మంకీపాక్స్ కేసు అని, అదే సమయంలో ఎటువంటి అంత‌ర్జాతీయ‌ ప్రయాణ చరిత్ర లేకుండా.. ఓ వ్య‌క్తికి వ్యాధి సోకడం ఇదే మొదటి సారి. 

కేరళలో మూడు కేసులు

యూఏఈకి చెందిన వ్యక్తి .. కేరళకు తిరిగి వచ్చిన తర్వాత జూలై 14న దేశంలో మొట్టమొదటి మంకీపాక్స్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత రోగిని తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. జులై 18న కేరళలోని కన్నూర్‌ జిల్లాలో మ‌రో మంకీపాక్స్‌ కేసు నమోదైంది. అదే రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో మంకీపాక్స్ వ్యాధి సోకిన మూడో కేసు నమోదైంది.

80 దేశాలలో మంకీపాక్స్ వ్యాప్తి
 
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వైరస్ (Monkeypox Virus) ఇప్పుడు ప్రమాదకర రూపం దాల్చుతోంది. ప్రపంచంలోని 80 దేశాల్లో ఇప్పటివరకు 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో 80 నుంచి 85 శాతం కేసులు యూరప్ దేశాల్లో న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.  లైంగిక సంపర్కం వల్ల అనేక ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. నివేదిక ప్రకారం, మంకీపాక్స్ చాలా ప్రాణాంతకం. దీని కారణంగా ఇప్పటివరకు 5 మంది మరణించారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !