
union minister Nitin Gadkari: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదనీ, త్వరలోనే దీనిని చట్టబదద్దం చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి (Union Road Transport and Highway Minister) నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫోన్‌లో మాట్లాడటం త్వరలో చట్టబద్ధం కావచ్చు, కానీ ఫోన్‌లో మాట్లాడేటప్పుడు.. ఏకకాలంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ అనుసరించాల్సిన కొన్ని బాధ్యతలు, నియమాలు తప్పనిసరిగా వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో ఈ ప్రకటన చేశారు.
లోక్‌సభలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. డ్రైవింగ్‌లో ఫోన్‌లో మాట్లాడటం ఇకపై నేరం కాదు.. దీనిని చట్టబద్దం చేస్తాం.. కానీ దీనిని తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలు, బాధ్యతలు ఉన్నాయి. ఫోన్ హ్యాండ్స్-ఫ్రీ పరికరానికి కనెక్ట్ చేయబడి ఉంటే మాత్రమే డ్రైవింగ్ లో ఫోన్‌లో మాట్లాడటానికి అనుమతి ఉంటుంది. అంతేకాదు ఫోన్‌ను కారులో కాకుండా జేబులో పెట్టుకుని ఉండాలి. "డ్రైవరు హ్యాండ్స్‌ఫ్రీ పరికరం వాడుతూ ఫోన్‌లో మాట్లాడితే శిక్షార్హమైన నేరంగా పరిగణించబడదు.. అలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించలేరు. ఒక వేళ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు ( impose any fine) విధిస్తే.. దానిని న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు" అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో మీరు ఫోన్‌లో మాట్లాడినందుకు అరెస్టు చేయబడితే, మీరు అభియోగంపై కోర్టులో అప్పీల్ చేయవచ్చు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వ్యక్తి ఫోన్ ను హ్యాండ్స్-ఫ్రీ డివైస్ కు కనెక్టు చేయకుండా నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్నట్లయితే, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికీ వ్యక్తిని చలాన్ చేయవచ్చు అని తెలిపారు. ఇదిలావుండగా, అంతకు ముందు రోజు గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలను 50% మేర తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భద్రతా ప్రమాణాలు, ప్రొటోకాల్స్‌ని అనుసరించి వాహనాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతున్నట్లు కూడా పేర్కొన్నారు. భవిష్యత్ ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ అని, దాన్ని ప్రపంచదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యమని తెలిపారు.
ప్రస్తుతం తాము గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్తున్నామని.. తన ఆలోచన మురుగు, టాయిలెట్ వాటర్ నుంచి తయారు చేయడమన్నారు. తక్కువ ఖర్చుతో సౌర, పవన శక్తిని వినియోగించుకోవచ్చన్నారు. ఇకపై కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.దేశీయంగా తయారవుతున్న ఆటోమొబైల్స్ సేఫ్టీ ఫీచర్స్ ఆధారంగా ఇండిపెండెంట్ ఏజెన్సీగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
డ్రైవింగ్ లో హ్యాండ్స్‌ఫ్రీ పరికరాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం !
డ్రైవిండ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడటం చట్టవిరుద్ధమని బెంగళూరు పోలీసులు పేర్కొంటున్నారు. డ్రైవింగ్ సమయంలో కాల్‌లు లేదా సంగీతం కోసం ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం చట్టవిరుద్ధమనీ, దీనిని జరిమానాలు సైతం విధించడంతో పాటు తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని పేర్కొంటున్నారు.