పంత్‌ను కాపాడిన డ్రైవర్, కండక్టర్‌‌ను సత్కరిస్తాం.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

By Sumanth KanukulaFirst Published Jan 1, 2023, 4:10 PM IST
Highlights

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. రూర్కీ సమీపంలో పంత్ కారు ప్రమాదానికి గురికాగా.. అతడిని రక్షించేందుకు  హర్యానా రోడ్‌వేస్ బస్సు డ్రైవర్ సుశీల్‌ కుమార్‌, కండక్టర్‌ పరంజిత్‌‌లు సాయం చేశారు.

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. రూర్కీ సమీపంలో పంత్ కారు ప్రమాదానికి గురికాగా.. అతడిని రక్షించేందుకు  హర్యానా రోడ్‌వేస్ బస్సు డ్రైవర్ సుశీల్‌ కుమార్‌, కండక్టర్‌ పరంజిత్‌‌లు సాయం చేశారు. ఈ క్రమంలోనే పంత్‌‌ను సాయం  అందించిన బస్సు డ్రైవర్, కండక్టర్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్మానించనుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటన చేశారు.  ప్రాణాలను పణంగా పెట్టి పంత్‌ను కాపాడటం ద్వారా వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆదివారం డెహ్రాడూన్‌లో హాస్టల్‌ ప్రారంభోత్సవంలో పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. ‘‘రూర్కీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్‌ను రక్షించేందుకు వచ్చిన హర్యానా రోడ్‌వేస్ బస్సు డ్రైవర్ మరియు కండక్టర్‌ను తమ ప్రభుత్వం గౌరవిస్తుంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి క్రికెటర్ పంత్ ప్రాణాలను కాపాడడం ద్వారా హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్, కండక్టర్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం వారిని సత్కరించనుంది’’ అని అన్నారు. 

Also Read: రిషభ్‌కూ ఓ కుటుంబం ఉంది.. ఇలాగేనా మీరు చేసేది.. ఫ్యాన్స్‌పై రోహిత్ భార్య, దినేశ్ కార్తీక్ ఆగ్రహం

 న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తుండగా పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే కారు పల్టీలు కొట్టింది. కాసేపటికే కారులో నుంచి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌, కండక్టర్‌ పరంజిత్‌ కారులో నుంచి పంత్‌ను రక్షించారు. వారు అతన్ని కారులోంచి బయటకు తీసి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు పంత్‌ను బయటకు తీసిన కొద్దిసేపటికే కారు పూర్తిగా దగ్దమైంది. తొలుత పంత్‌ను హరిద్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే పంత్‌కు చికిత్స కొనసాగుతుంది. ఇక, ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. అంతే కాకుండా వెన్ను, కాళ్లలో కొన్ని భాగాల్లో గాయాలయ్యాయి. అయితే పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఆదివారం మధ్యాహ్నం డెహ్రాడూన్‌లో పంత్ చికిత్స పొందుతున్న మ్యాక్స్ ఆస్పత్రికి వెళ్లారు. పంత్‌ ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందిస్తున్న చికిత్స వివరాలను సీఎం పుష్కర్ సింగ్ ధామి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

click me!