బోనులో వున్న ‘‘పులి’’ (శివసేన )తో స్నేహం వుండదు.. మహారాష్ట్రలో ఒంటరిగానే, బీజేపీ నేత వివరణ

Siva Kodati |  
Published : Jun 11, 2021, 03:02 PM IST
బోనులో వున్న ‘‘పులి’’ (శివసేన )తో స్నేహం వుండదు.. మహారాష్ట్రలో ఒంటరిగానే, బీజేపీ నేత వివరణ

సారాంశం

పులితో (శివసేన పార్టీ గుర్తు) బీజేపీ స్నేహం చేస్తుందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వివరణ ఇచ్చారు.

ప్రధాని నరేంద్రమోడీతో ఉద్ధవ్ థాక్రే భేటీ కావడం.. ఆ మరుసటి రోజే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మోడీని ప్రశంసించడంతో సేన-బీజేపీల మధ్య తిరిగి సఖ్యత నెలకుంటోందని భావించారు. ఈ నేపథ్యంలో పులితో (శివసేన పార్టీ గుర్తు) బీజేపీ స్నేహం చేస్తుందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వివరణ ఇచ్చారు. ''బోనులో ఉన్న పులి''తో స్నేహం చేయాలని తమ పార్టీ కోరుకోవడం లేదని పాటిల్ అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్, పుణె, సహా ప్రధాన నగరాల్లో 2022 ప్రారంభంలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

Also Read:మొన్న ఉద్ధవ్, నేడు సంజయ్ రౌత్.. మోడీయే టాప్ లీడరంటూ కితాబు: బీజేపీకి సేన దగ్గరవుతోందా..?

పులలతో తామెప్పుడూ స్నేహంగా ఉంటామంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పాటిల్ స్పందిస్తూ, ఇటీవల తాను ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జంతు సంరక్షణ కేంద్రంలో పనిచేసే ఒక వ్యక్తి పులి నమూనాతో పాటు ఫోటో అల్బమ్ బహుమతిగా ఇచ్చాడని, ఇందుకు గాను చక్కటి బహుమతి ఇచ్చావని చెబుతూ, పులులకు తామెప్పుడూ మిత్రులమని పేర్కొన్నట్టు తెలిపారు. అయితే మీడియా మిత్రులు శివసేన పార్టీ గుర్తు కూడా పులి కావడంతో దానితో తన వ్యాఖ్యలను పోల్చినట్టు పాటిల్ వెల్లడించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండానే విజయం సాధిస్తామని పాటిల్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం