11 నెలల కిందటే పెళ్లి .. పరాయి స్త్రీ మోజులో పడ్డ భార్త.. మనస్తాపానికి గురైన భార్య.. దీంతో .. 

By Rajesh KarampooriFirst Published Nov 24, 2022, 2:39 PM IST
Highlights

కట్టుకున్నవాడు పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండని తెలుసుకున్నది ఆ మహిళ. మనస్థాపానికి గురైన ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన బెంగళూరు లోని రామ్మూర్తి నగర రిచర్డ్‌ గార్డెన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సభ్యసమాజంలో మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. కట్టుకున్న వారిని విడిచి పరాయి వారితో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ.. చేతులారా వారి పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నారు. ఇలాంటి సంబంధాలు మానవతా విలువలకు విరుద్ధమని, చట్టరీత్యా నేరమని తెలుసు.. అయినా పట్టించుకోవడం లేదు. ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు లాగా వ్యవహరిస్తున్నారు. చివరికి అసలు విషయం బయటపడితే.. కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తులతో మోజులో పడిపోయి.. దారుణాలకు
పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజం ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది. ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది ఓ మగువ. దంపతులిద్దరికి పెద్ద కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం. విలాసవంతమైన జీవితం. కానీ.. కట్టుకున్నవాడు పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండని తెలుసుకున్నది. తాను కన్న కలలన్ని కల్లలయ్యాయని  మనస్థాపానికి గురైంది. దీంతో  ఆమె ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన బెంగళూరు లోని రామ్మూర్తి నగర రిచర్డ్‌ గార్డెన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

11 నెలల కిందటే పెళ్లి  

బెంగుళూర్ కు చెందిన అభిషేక్, శ్వేతలకు గత ఏడాది పెళ్లైంది. వీరద్దరూ సాప్ట్ వేర్ ఇంజనీర్లు. శ్వేత ఐబీఎం కంపెనీలో టెక్కీగా పని చేస్తుండగా.. అభిషేక్టీసీఎస్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికి లక్షల్లో జీతం.. విలాసవంతమైన జీవితం. కానీ.. అభిషేక్ కు పెళ్లికి ముందు అభిషేక్‌కు ఓ యువతితో ఎఫైర్ ఉండి.. ఆ విషయం తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత కూడా ఆ సంబంధాన్ని అలాగే కొనసాగించారు. ఈ విషయం శ్వేతకు తెలిసింది. ఈ విషయంపై దంపతులిద్దరికి పలు సందర్భాల్లో మధ్య గొడవలు జరిగాయి. ఈ విషయం పెద్దల దాకా పోయింది. రాజీ పంచాయతీల తరువాత దంపతులు కలిసే ఉంటున్నారు. 

కానీ.. అభిషేక్ లో ప్రవర్తన లో ఎలాంటి మార్పు రాలేదు. కుక్క తోకకు రాయి కట్టినట్టు వ్యవహరించారు. దీంతో మోసపోయానని గ్రహించిన శ్వేత ..విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని పోస్టుమార్టం పంపకుండానే.. అంత్యక్రియలు పూర్తిచేశారు. అల్లుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అత్తమామలు అతనితో పాటు కుటుంబ సభ్యులపై  రామ్మూర్తి నగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

click me!