ఏనాడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు: కరోనాపై కన్నీళ్లు పెట్టుకొన్న ముంబై డాక్టర్

By narsimha lodeFirst Published Apr 21, 2021, 5:10 PM IST
Highlights

కరోనా ఉధృతితో ఆసుపత్రుల్లో దయనీయ పరిస్థితులున్నాయని, ఇలాంటి పరిస్థితులు తాను ఏనాడూ చూడలేదని ముంబైకి చెందిన డాక్టర్ తృప్తి గిలాడీ భావోద్వేగానికి గురయ్యారు.
 

ముంబై: కరోనా ఉధృతితో ఆసుపత్రుల్లో దయనీయ పరిస్థితులున్నాయని, ఇలాంటి పరిస్థితులు తాను ఏనాడూ చూడలేదని ముంబైకి చెందిన డాక్టర్ తృప్తి గిలాడీ భావోద్వేగానికి గురయ్యారు.ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో కొన్ని సమయాల్లో తాము ఏమీ చేయలేని నిస్సహాయులుగా మారామని ఆమె ఆవేదన  వ్యక్తం చేశారు. మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటిస్తే  ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని  ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ముంబై నగరాన్ని కరోనా చుట్టేసిందన్నారు. దేశంలోని ఇతర నగరాల్లో కూడ ఇదే రకమైన పరిస్థితి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత నెలకొంది. రోగులకు బెడ్స్ సరిపోను దొరకడం లేదన్నారు.దీంతో రోగులు వారి కుటుంబసభ్యులు, బంధువుల పడుతున్న ఇబ్బందులను చూసి తాము నిస్సహాయులుగా మారుతున్నామన్నారు. 

కరోనా రాదు, నాకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందని భావించేవారికి కూడ కరోనా సోకవచ్చు. చాలా మంది యువకులు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చన్నారు. మాస్క్, భౌతిక దూరం పాటిస్తేనే  ప్రయోజనం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆసుపత్రుల్లో చోటు చేసుకొంటున్న ఘటనలను ఆమె ప్రస్తావిస్తూ కన్నీళ్లు పెట్టుకొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.

  


 

click me!