నాసిక్‌లో ఆక్సిజన్ లీక్:రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, విచారణకు ఉద్దవ్ ఆదేశం

By narsimha lodeFirst Published Apr 21, 2021, 4:24 PM IST
Highlights

మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకై  22 మంది మరణించిన ఘటనపై  మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే  బుధవారం నాడు విచారణకు ఆదేశించారు. 

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకై  22 మంది మరణించిన ఘటనపై  మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే  బుధవారం నాడు విచారణకు ఆదేశించారు. జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో  వెంటిలేటర్ పై ఉన్న  రోగులకు ఆక్సిజన్ అందక 22 మంది ఇవాళ మరణించారు. ఆక్సిజన్ ట్యాంకర్ నుండి  ఆక్సిజన్ లీక్ కావడంతో  ఆక్సిజన్ సరఫరాను  నిలిపివేశారు. దీంతో సుమారు 30 నిమిషాల పాటు  వెంటిలేటర్ పై ఉన్న రోగులకు  ఆక్సిజ్న అందలేదు. దీంతో 22 మంది రోగులు మరణించారు. ఈ ఆసుపత్రి నుండి 31 మంది రోగులను వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

also read:నాసిక్‌ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీక్: 22 మంది మృతి

నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి నడుస్తోంది.  నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ పాలకవర్గం ఆధీనంలో ఉంది.  దీంతో ఆసుపత్రిలో ఈ దుర్ఘటనకు బీజేపీ నేతృత్వంలోని పాలకవర్గం వైఫల్యమే కారణమని అధికారపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్టుగా సీఎం ఠాక్రే ప్రకటించారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు సీఎం ఉద్దవ్. ఈ ప్రమాదానికి కారణమైన వారిని వదలబోమన్నారు. ఈ దురదృష్టకర ఘటనను రాజకీయం చేయకూడదని ఆయన సూచించారు.  నాసిక్ ఘటనపై మహారాష్ట్ర సంతాపం వ్యక్తం చేస్తోందనిఆయన చెప్పారు.

 

click me!