ట్రిపుల్ తలాక్ బిల్లు: పార్లమెంట్‌లో గందరగోళం, జేపీసీకి విపక్షాల పట్టు

By narsimha lodeFirst Published Dec 27, 2018, 3:49 PM IST
Highlights

ట్రిపుల్ తలాక్ బిల్లుపై  గురువారం నాడు పార్లమెంట్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.ఈ బిల్లును జేపీసీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి


న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లుపై  గురువారం నాడు పార్లమెంట్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.ఈ బిల్లును జేపీసీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును జేపీసీకి పంపాలని కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్‌‌కు ఎంఐఎం, టీఎంసీలు అండగా నిలిచాయి.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం నాడు రెండు దఫాలు లోక్ సభ వాయిదా పడింది. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే  ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సహకరించాలని రవిశంకర్ ప్రసాద్  విపక్షాలను కోరారు.

ఈ బిల్లు ఏ కులానికి, మతానికి, విశ్వాసానికి సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మానత్వానికి, న్యాయానికి ఈ బిల్లు ప్రతీక అని మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.బిల్లుపై ఉన్న అభ్యంతరాలను తెలిపాలని కూడ ఆయన కోరారు.

ట్రిపుల్ తలాక్ బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌కు టీఎంసీ, ఎంఐఎం కూడ మద్దతుగా నిలిచాయి.

ఈ బిల్లుపై కేంద్రం ఎవరినీ సంప్రదించలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ప్రజలు, ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. స్పీకర్  తనకు ఉన్న అధికారాలను ఉపయోగించుకొని జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని  ఆయన కోరారు. 

ఈ బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్నదే విపక్షాల అందరి అభిప్రాయమని తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సందీప్‌ బందోపాధ్యాయ తేల్చి చెప్పారు. ఆర్ఎస్పీ కూడ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది.


 

click me!