రాందేవ్ బాబాకు జీఎస్టీ దెబ్బ.. తగ్గిన అమ్మకాలు

By ramya neerukondaFirst Published Dec 27, 2018, 3:27 PM IST
Highlights

ఈ పతంజలి ఉత్పత్తులు మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే.. వీటికి భారీ స్పందన వచ్చింది. విదేశీ ఉత్పత్తులను పక్కనపెట్టేసి మరీ.. ఈ ఉత్పత్తులు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపించారు.

దేశీయ ఉత్పత్తుల పేరిట మార్కెట్లోకి అడుగుపెట్టింది పతంజలి. ఈ పతంజలి ఉత్పత్తులు మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే.. వీటికి భారీ స్పందన వచ్చింది. విదేశీ ఉత్పత్తులను పక్కనపెట్టేసి మరీ.. ఈ ఉత్పత్తులు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపించారు.

మార్కెట్లో తమకు ఎదురేలేదు అంటూ సాగిపోతున్న పంతజలికి తొలిసారిగా బ్రేకులు పడ్డాయి. జీఎస్టీ పేరిట పతంజలికి భారీ దెబ్బ తగిలింది. ఎన్డీయే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీఎస్టీ, అలాగే వెలువలా వచ్చిపడుతున్న విదేశీ కంపెనీలు పోటీగా నిలపడంతో.. పతంజలి అమ్మకాల్లో వెకనపడింది.

సీఏఆర్ఈ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది పతంజలి బ్రాండ్ వెయ్యి కోట్లు కోల్పోయింది. రాందేవ్ బాబా మార్గదర్శనంలో హరిద్వార్ కేంద్రంగా నడుస్తున్న పతంజలి కంపెనీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.9030 కోట్ల అమ్మకాలు సాధించగా..2017-18లో రూ.8135కోట్లకు పడిపోయింది.

గత ఆర్థిక సంవత్సరం రూ.1190కోట్లు లాభాలు ఆర్జించగా.. ఈ ఆర్థిక సంవత్సరం లాభాలు రూ.529కి పడిపోయాయి. జీఎస్టీ కారణంగానే పతంజలి వెనుకపడిపోయిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

click me!