జీన్స్, టీ-షర్ట్ ధరించి ఆఫీసుకు రావొద్దు - ఉద్యోగులకు బీహార్ లోని సరన్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు.. ఎందుకంటే

By Asianet News  |  First Published Apr 19, 2023, 7:54 AM IST

ఉద్యోగులెవరూ జీన్స్, టీ-షర్ట్ ధరించి ఆఫీసుకు రాకూడదని  బీహార్ లోని సరన్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ మంచి దుస్తులు ధరించాలని,  ఐడెంటీ కార్డులు వేసుకోవాలని సూచించారు. 


బీహార్ లోని సరన్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రభుత్వ ఉద్యోగులందరూ జీన్స్ ధరించి ఆఫీసుకు రావడాన్ని నిషేధించారు. అలాగే టీ-షర్ట్ కూడా వేసుకోకూడదని సూచించారు. ఈ మేరకు ఆ మేజిస్ట్రేట్ అమర్ సమీర్ సర్క్యూలర్ జారీ చేశారు. ఆఫీసులో పని చేసే ఉద్యోగులందరూ ఫార్మల్స్ ధరించి రావాలని అందులో ఆదేశించారు. అయితే సర్క్యూలర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

నారాయణపేటలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి.. వారిని కాపాడేందుకు వెళ్లిన మహిళ కూడా..

Latest Videos

ప్రతీ రోజు మేజిస్ట్రేట్ ఎంతో మంది ప్రజలు వస్తుంటారని, వారికి అధికారులు ఎవరో సులభంగా గుర్తు పట్టేందుకు ఈ డ్రెస్ కోడ్ ఉపయోగపడుతుందని మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలు అధికారులను చూడగానే గుర్తు పట్టేవిధంగా ఉండాలని తెలిపారు. మంచి దుస్తులు ధరిస్తూ.. ఐడెంటీ కార్డు కూడా వేసుకోవాలని సూచించారు. అందుకే ఉద్యోగులందరికీ ఐడెంటీ కార్డులు అందజేశామని పేర్కొన్నారు. 

ఇక మాఫియా ఎవరినీ భయపెట్టదు - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉద్యోగులందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫార్మల్ దుస్తులు ధరించి కార్యాలయాల్లో ఉండాలని మేజిస్ట్రేట్ సూచించారు. నిర్దిష్ట శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని, వీడియో కాన్ఫరెన్స్, వీడియో కాలింగ్ ద్వారా కూడా ఆదేశాల స్థితిగతులను తెలుసుకుంటామని పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాలను, ముఖ్యంగా డ్రెస్ కోడ్ ను కచ్చితంగా పాటించాలని, తప్పు చేస్తే జరిమానా విధిస్తామని ఆయన ఉద్యోగులను హెచ్చరించారు. కార్యాలయాల్లో పని సంస్కృతిని మార్చాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. 

click me!