సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కాల్ చేయొద్దు.. పెళ్లి ప్రకటన వైరల్... మేమేం పాపం చేశాం అంటున్న టెకీలు...

By SumaBala BukkaFirst Published Sep 21, 2022, 8:32 AM IST
Highlights

ఓ వివాహ ప్రకటన ఇప్పుడు సోషల మీడియాను షేక్ చేస్తోంది. ‘సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మాత్రం వద్దు’ అని అందులో పేర్కొనడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. 

కొన్ని మ్యాట్రిమోనియల్ ప్రకటనలు ఈ మధ్య తెగ పాపులర్ అవుతున్నాయి. ఇలాంటి అర్హతలు, ఈ గుణాలు ఉన్నవారు మాత్రమే కావాలంటూ చేసిన పలు ప్రకటనలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా వరుడు కావాలి అంటూ  యువతి తరఫు వారు చేసిన ఓ ప్రకటన సైతం అందర్నీ ఆశ్చర్య పరిచేలా ఉంది. ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్’  అయితే మాకొద్దు అంటూ అందులో ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. ‘ధనిక వ్యాపార కుటుంబంలోని ఎంబీఏ పూర్తి చేసిన వధువుకు ఐఏఎస్/ఐపీఎస్, డాక్టర్లు, పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త  అయిన వరుడు కావాలి’  అని ప్రకటిస్తూనే.. ‘ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కాల్ చేయొద్దు’ అంటూ స్పష్టం చేశారు.  

కాగా,  ఈ ప్రకటనకు సంబంధించిన క్లిప్పింగ్ ను  వ్యాపారవేత్త సమీర్ అరోరా ట్విట్టర్లో షేర్ చేస్లూ.. ‘ఐటీ భవిష్యత్తు సజావుగా కనిపించడం లేదు’  అని కామెంట్ జోడించాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. దీనిమీద నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. దేశంలో ఎక్కువమంది సాఫ్ట్ వేర్లే  ఉన్నారని  అర్థం వచ్చేలా.. అరోరా వ్యాఖ్యలను ఓ యూజర్ ఉటంకిస్తూ ‘అయితే దేశ ప్రజల భవిష్యత్తే సజావుగా లేదు’ అంటూ స్పందించాడు. ‘ఐటీ లేకపోతే దేశ భవిష్యత్తు సరిగా ఉండదు’ అని మరో యూజర్ పేర్కొన్నాడు. ‘మేం అంత చెడ్డవాళ్ళమా’ అంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘దేవుడా  ధన్యవాదాలు…  నాకు 11 ఏళ్ల క్రితం పెళ్లయింది’  అని మరో వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించాడు. 

Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2

— Samir Arora (@Iamsamirarora)
click me!