పోలీసులకు లంచం ఇవ్వడానికి కుమార్తెలను అమ్ముకుంటున్నారు .. సొంత సర్కారు మీద ప్రజ్ఞా ఠాకూర్‌ సంచ‌ల‌నవ్యాఖ్య‌లు

By Rajesh KarampooriFirst Published Sep 21, 2022, 7:09 AM IST
Highlights

తాను దత్తత తీసుకున్న గ్రామాల్లోని ప్రజలకు జీవనోపాధి కోసం ఎలాంటి వనరులు లేవని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తెలిపారు. వారు (గ్రామస్తులు) త‌న జీవ‌నోపాధి కోసం మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు వారిని అరెస్టు చేస్తే.. లంచం ఇవ్వడానికి వారు త‌మ‌ కుమార్తెలను అమ్ముకుంటున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు 

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌.. తాజాగా సొంత పార్టీపై  ఆసక్తికర కామెంట్లు చేశారు. అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న తమ బంధువులను పోలీసుల కస్టడీ నుంచి విడిపించుకునేందుకు త‌ల్లిదండ్రులు తమ కుమార్తెల అమ్ముకుంటున్నారని  సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

బోర్డ్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో జరిగిన కార్యక్రమంలో ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా  ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తాను  దత్తత తీసుకున్న గ్రామాలు, గ్రామాల పిల్లలకు డ్రాయింగ్‌ పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు అందించిన పరిశ్రమల సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.అనంత‌రం మాట్లాడుతూ.. తాను దత్తత తీసుకున్న గ్రామాల్లోని  స‌రైన జీవనోపాధి లేక‌.. ప్ర‌జ‌లు నాటుసారా కాస్తారని,  అక్ర‌మ మ‌ద్యం వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో అక్రమ మద్యం వ్యాపారం అభివృద్ధి చెందడం దిగ్భ్రాంతికరమైనది, ఆందోళన కలిగించే విషయమని అన్నారు.
  
తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో పిల్లలు చదువుకోవడానికి వనరులు లేవ‌నీ, ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు క్రమబద్ధమైన సంపాదన లేక‌.. వారు అక్రమ మద్యం తయారు చేయడం, అమ్మడం వంటి వాటిల్లో పాలుపంచుకుంటారని తెలిపారు. కొన్నిసార్లు పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారనీ, బెయిల్ పొందడానికి వారి వద్ద డబ్బులు లేక‌.. వారు తమ నాలుగు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల కూతుళ్లను అమ్ముకొని లంచం ఇచ్చి బయటకొస్తున్నారని ప్రజ్ఞా ఠాకూర్‌ పేర్కొన్నారు. 
 
రాష్ట్ర రాజధానిలో పోలీసుల ఆధ్వర్యంలో అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నదని ఠాకూర్ ప్రకటన సూచిస్తోందని ప్రతిపక్ష నేత గోవింద్ సింగ్ అన్నారు. అక్రమ మద్యం వ్యాపారంలో నిమగ్నమైన వారిని విడిపించేందుకు పోలీసులకు లంచం ఇచ్చేందుకు బాలికలను విక్రయిస్తున్నారని, ఠాకూర్ వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సింగ్ అన్నారు.

బీజేపీ ఎంపీ  మాట్లాడిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై సమాధానం చెప్పాలని శివరాజ్‌సింగ్‌ చౌహాన్ ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌ని  కాంగ్రెస్‌ నిలదీసింది. ‘బేటీ పఢావో-బేటీ బచావో’ అంటే ఇదేనా? అని విమ‌ర్శించింది.  

click me!