Ukraine Russia Crisis ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 20 వేల మంది ఇండియన్లు

Published : Feb 24, 2022, 01:09 PM IST
Ukraine Russia Crisis ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 20 వేల మంది ఇండియన్లు

సారాంశం

ఉక్రెయిన్ లో చిక్కుకొన్న 20 వేల మంది ఇండియన్లను  స్వదేశానికి రప్పించడం కొంత ఇబ్బందిగా మారింది. ఉక్రెయిన్ లో గగనతలం మూసివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. 

న్యూఢిల్లీ: Ukraine లో సుమారు 20 వేల మంది Indians చిక్కుకొన్నారు. మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత  ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. దీంతో  ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. 

ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించినట్టుగా  Riussia అధ్యక్షుడు వ్లాదిమిర్ putin గురువారం నాడు ప్రకటించారు. దీంతో ఇవాళ తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై  పలు చోట్ల Bomb పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.

ఇవాళ ఉదయమే 250 మందిని ఉక్రెయిన్ నుండి తీసుకురావాల్సిన విమానం ఖాళీగా వెనక్కి వచ్చింది.  ఉక్రెయిన్  గగనతలం మూసివేసినందున ఇండియన్లను తీసుకు రాకుండానే  నిలిచిపోయింది. భారత పౌరులు, విద్యార్ధుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

రష్యా ఉక్రెయిన్ మధ్య చోటు చేసుకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వశాఖ  కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది.  24 గంటల పాటు కంట్రోల్ రూమ్  పనిచేస్తోందని భారత్ ప్రకటించింది. 

ఉక్రెయిన్ లో ఉన్నత విద్యాభ్యాసం కోసం విద్యార్ధులు ఎక్కువగా వెళ్తారు. ఉక్రెయిన్ లో MBBS విద్యను అభ్యసించేందుకు విద్యార్ధులు వెళ్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని పలు రాష్ట్రాల విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉన్నారని సమాచారం.మరో వైపు న్యూఢిల్లీలోని భారత ఎంబసీ కార్యాలయం వద్ద ఉక్రెయిన్ లో ఉన్నవారి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. తమ వారిని సురక్షితంగా ఇండియాకు రప్పించాలని కోరారు.

ఉక్రెయిన్ లో పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది., ఉక్రెయిన్ లో ఉన్న ఇండియన్లను స్వదేశానికి రప్పించేందుకు విమానాలను సిద్దంగా ఉంచారు. 2014లో తూర్పు ఉక్రెయిన్ పై మలేషియా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ MH 17 కూల్చివేసిన విషయం తెలిసిందే.

 ఉక్రెయిన్ పై Russia మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు.  Ukraine పై  రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభిస్తున్నట్టుగా ఆ దేశాధ్యక్షుడు Vladmir Putin ప్రకటించారు. ఉక్రెయిన్ , రష్యా దళాల మధ్య ఘర్షణలు అనివార్యమైనట్టు  ఆయన ప్రకటించారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెంక్సీ ఈ విషయమై స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. ఐరోపాలో పెద్ద యుద్ధానికి మద్దతు ఇవ్వవద్దని రష్యన్లకు అర్ధరాత్రి ఉద్వేగభరితంగా కోరారు.ఉక్రెయిన్ గురించి రష్యా ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని ఆయన చెప్పారు. తాను పుతిన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే సమాధానం లేదన్నారు. నిశ్శబ్దం మాత్రమే అని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర 2 లక్షల మంది సైనికులు ఉన్నారని ఆయన వివరించారు. 

 ఉక్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని తూర్పు ప్రాంతంలోని మిమానాశ్రయాలను అర్ధరాత్రి 7 గంటల నుండి మూసివేసింది. ఉక్రెయిన్ అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని అన్యాయమైన దాడిగా అమెరికా అధ్యక్షుడు Joe Biden  అభిప్రాయపడ్డారుఉక్రెయిన్ మిలటరీ ఆపరేషన్ కు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది.  రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో దళాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.  
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌