Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: మలేరియా డ్రగ్ క్లోరోక్విన్ ను రికమెండ్ చేసిన ఐసీఎంఆర్

కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు పెరుగుతున్న తరుణంలో ఈ వ్యాధి నివారణకు మందును కనిపెట్టేందుకు ప్రయోగాలు సాగుతున్నాయి. కరోనా నివారణ కోసం యాంటీ మలేరియా వ్యాక్సిన్ ను ఉపయోగించాలని ఐసీఎంఆర్ సూచించింది.

Covid-19 Task Force Recommends Use Of Anti -Malarial Drug Choloroquine For Treatment
Author
New Delhi, First Published Mar 23, 2020, 4:44 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు పెరుగుతున్న తరుణంలో ఈ వ్యాధి నివారణకు మందును కనిపెట్టేందుకు ప్రయోగాలు సాగుతున్నాయి. కరోనా నివారణ కోసం యాంటీ మలేరియా డ్రగ్ క్లోరోక్విన్ ను ఉపయోగించాలని ఐసీఎంఆర్ సూచించింది.

Also read:కరోనా ఎఫెక్ట్: వెయ్యి మందికి ఏర్పాట్లు, 8 మందితోనే పెళ్లి

దేశంలో సోమవారం నాటికి కరోనా పాజిటివ్ కేసులు 415 కు చేరుకొన్నాయి. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి.

కరోనాపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్  కమిటీ సోమవారం నాడు ఓ ప్రకటన చేసింది.క్లోరోక్విన్ ను రికమండ్ చేసింది.కరోనా వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి క్లోరోక్విన్ ను ఉపయోగించాలని ఐసీఎంఆర్ సూచించింది.  దీని వల్ల మంచి ఫలితం ఉంటుందని  టాస్క్ ఫోర్స్ సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios