చండీగఢ్ లో దారుణం.. ఆసుపత్రిలో మూడురోజుల శిశువును ఎత్తుకెళ్లిన శునకాలు..

By SumaBala BukkaFirst Published Jun 29, 2022, 6:44 AM IST
Highlights

పుట్టిన మూడు రోజులకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. అదికూడా భయంకరమైన నరకం అనుభవించి మరీ చనిపోయింది. పానిపట్ లో ఓ మూడు రోజుల చిన్నారిని వీధి కుక్కలు చంపేశాయి. 

చండీగఢ్ : హర్యానాలోని Panipatలో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన జరిగింది. Maternity hospitalలోకి ప్రవేశించిన stray dogs బెడ్ పై తల్లి పొత్తిళ్లలో ఉన్న మూడు రోజుల శిశువును ఎత్తుకెళ్లాయి. కాగా ఆ శిశువు తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. పానిపట్ లోని  ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో షబ్నం అనే మహిళ మూడు రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఆసుపత్రిలోకి ప్రవేశించిన కొన్ని శునకాలు ఆ తల్లి పక్కన ఉన్న శిశువును నోట కరుచుకుని వెళ్లాయి. ఆ సమయంలో తల్లి షబ్రం సహా ఇద్దరు బంధువులు నిద్రలో ఉన్నారు.

రాత్రి  2.15 గంటల సమయంలో తల్లి లేచి చూడగా బిడ్డ కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఆస్పత్రికి యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో అలర్టైన ఆసుపత్రి సిబ్బంది, శిశువు బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయితే హాస్పిటల్ సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో ఓ కుక్క శిశువును నోట కరుచుకుని ఉండడం గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే  శిశువు తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పాకిస్తాన్ లో దారుణం.. కడుపులోనే తల ఉంచేసి, కుట్టేసి.. ప్రసవం కోసం వస్తే నరకం చూపించారు..

కాగా, ఈ యేడు ఏప్రిల్ 27న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. నర్సు నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం పోయింది. నర్సు చేతిలోంచి  జారిపోయి అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందాడు. చింతన్ ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే టవల్ సాయం లేకుండా శిశువును నర్సు ఒంటి చేత్తో ఎత్తుకోవడంతో ఆ శిశువు జారి కింద పడిపోయింది. దీంతో తలకు గాయమై మృతి చెందింది. ఇది చూసి తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 

అయితే వారిని అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బంది.. మృత శిశువు జన్మించిందని  బుకాయించే ప్రయత్నం చేశారు. శిశువు  ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు తప్పిదంవల్లే కిందపడి మృతి చెందినట్లు సదరు తల్లి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు నివేదికలో వెల్లడయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు.

click me!