Plastic Items Ban: జులై 1 నుంచే సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై​ నిషేధం.. అవి వాడితే క‌ఠిన చ‌ర్య‌లే..!

Published : Jun 29, 2022, 06:02 AM IST
Plastic Items Ban: జులై 1 నుంచే సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై​ నిషేధం.. అవి వాడితే క‌ఠిన చ‌ర్య‌లే..!

సారాంశం

Single Use Plastic Items Ban: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఒకేసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై జులై 1 నుంచి నిషేధం విధిస్తున్న‌ట్టు పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. పెట్రో కెమికల్‌ సంస్థలు కూడా ప్లాస్టిక్‌ ముడిసరకును వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీచేసింది.

Single Use Plastic Items Ban: ప‌ర్య‌వ‌ర‌ణాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి మాత్రమే వాడి పారేసి ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై  పూర్తిగా నిషేధం విధించింది. 2022, జులై 1 నుంచి Single Use Plasticపై నిషేధం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న‌  'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. దశల వారీగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (Single use plastic items) ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని కేంద్రం ఆలోచన‌. చెత్తా చెదారంలోకి చేరి పర్యావరణానికి హాని కలిగించే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నామని వెల్లడించింది.

జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా..సింగిల్ యూజ్ ప్లాస్టిక్ Single Use Plastic Items Ban వాడకాన్ని నిషేధించనున్నారు. దీనికి సంబంధించి  నూత‌న మార్గదర్శకం ఏమిటో? ఏ ఏ వస్తువులు నిషేధించబడతాయో ? తెలుసుకుందాం..

> ప్లాక్టిక్‌ పుల్లలతో కూడిన ఇయర్‌ బడ్స్‌

> బుడగలకు ఉపయోగించే ప్లాస్టిక్‌ పుల్లలు

> ప్లాస్టిక్‌ జెండాలు

> క్యాండీ స్టిక్స్‌ప్లాస్టిక్‌  ఐస్‌ క్రీమ్‌ పుల్లలు

> అలంకరణ కోసం వినియోగించే థెర్మకోల్‌

> ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు

> మిఠాయి డబ్బాలకు చుట్టే ప్లాస్టిర్‌ రేపర్లు, ప్యాకేజింగ్‌ రేపర్లు

> ఆహ్వాన పత్రికలు

> సిగరెట్‌ పెట్టెలు

> 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లు

> కాఫీ, టీ కలుపుకొనే పుల్లలు

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (Single use plastic items) ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు కేంద్రం జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఏదైనా సంస్థ ఈ నిషేధిత వస్తువులను విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లయితే.. దాని వ్యాపార లైసెన్స్ రద్దు చేయబడుతుంది. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఈ వస్తువుల దిగుమతిని నిలిపివేయాలని కస్టమ్స్ శాఖను కోరింది. పౌరులను సైతం భాగస్వాములను చేసేందుకు పరిష్కార వేదికగా సీపీసీబీ గ్రీవెన్స్‌ రెడ్రసల్‌ యాప్‌ను ఆవిష్కరించింది.

అదే సమయంలో.. ఈ వస్తువుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న పరిశ్రమలకు ముడిసరుకును అందించవద్దని పెట్రోకెమికల్ పరిశ్రమలకు కూడా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ నిషేధం అమలుతో.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్న 60 దేశాల జాబితాలో భారత్ కూడా చేరనుంది. కానీ నిషేధం కంటే ముఖ్యమైనది, దానిని అనుసరించి చేయవలసి ఉంటుంది.  
 
 'ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ 2021 సవరణ నిబంధనల ప్రకారం.. సెప్టెంబర్ 30, 2021 నుండి  డెబ్బై ఐదు మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వాడకాన్ని నిషేధించింది. 31 డిసెంబర్ 2022 నుండి అమలులోకి వ‌చ్చిన నిబంధ‌న ప్ర‌కారం  నూట ఇరవై మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం కలిగిన వాటిపై నిషేధం విధించింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం