దారుణం...శిశువును పీక్కుతిన్న ఊరకుక్క

First Published Jul 26, 2018, 12:37 PM IST
Highlights

బీహార్ లో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది.  నడి రోడ్డుపై కొన్ని రోజుల వయసున్న శిశువును ఓ ఊకకుక్క నోట కరుచుకిని తిరుగుతూ కనిపించింది. అంతే కాకుండా శిశువు మృతదేహాన్ని తన పదునైన పళ్లతో రెండుగా చీలుస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించింది.

బీహార్ లోని బెతియా పట్టణంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఓ ఆస్పత్రి సమీపంలోని రోడ్డుపై ఓ ఊరకుక్క ఓ శిశువును నోట కర్చుకుని పరుగెత్తడాన్ని రోడ్డుపై వెళుతున్న వారు గమనించారు. అది కొద్ది దూరం వెళ్లాక శిశువు మృతదేహాన్ని రెండుగా చీల్చి తినడానికి ప్రయత్నించింది. అయితే ఈ దారుణాన్ని చూసినవారు మానవత్వాన్ని మరిచి తమకేమీ పట్టదన్నట్లు వెళ్లిపోయారు. ఏ ఒక్కరు ఆ కుక్క నుండి చిన్నారి మృతదేహాన్ని వేరు చేసే ప్రయత్నం చేయలేదు.

అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆస్పత్రి సిబ్బందే నిర్లక్ష్యంగా ఈ మృత శిశువును రోడ్డుపై పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరిండెంట్...ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
click me!