శబరిమల ఆలయానికి సమీపంలో పేలుడు పదార్ధాల కలకలం: ఆరు జిలెటిన్స్ స్టిక్స్ స్వాధీనం

By narsimha lodeFirst Published Jan 20, 2022, 9:26 AM IST
Highlights

కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయానికి సమీపంలో పేలుడు పదార్ధాలు కలకలం రేపాయి. తిరువాభపురం ఊరేగింపు తిరుగు పయనయం కావడానికి కొద్ది గంటల ముందే వంతెన కింద పేలుడు పదార్ధాలు లభ్యమయ్యాయి.
 

తిరువనంతపురం: ప్రసిద్ద పుణ్యక్షేత్రం Sabarimalaకు సమీపంలో Explosives పదార్ధాలను బుధవారం నాడు Police స్వాధీనం చేసుకొన్నారు.  తిరువాభపురం ఊరేగింపు తిరుగు పయనయం కావడానికి కొద్ది గంటల ముందే ఈ పేలుడు పదార్ధాలు లభ్యం కావడం కలకలం రేపుతుంది. Kerala లోని Pathanamthitta జిల్లాలోని వడస్సెరిక్కరాలోని పెంగట్ వంతెన కింద ఆరు gelatin sticks  ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.బ్రిడ్జి కింద పేలుడు పదార్ధాలను పోలీసులు గుర్తించారు.

పేలుడు పదార్ధాలను bomb  స్వ్కాడ్ నిర్వీర్యం చేసింది. శబరిమల నుండి తిరువాభరణం మోసుకెళ్లే పేటికను ఈ నెల 21న తెల్లవారుజామున 4 గంటలకు ఈ రహదారి గుండా పందళానికి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ ఘటనపై తిరువాభరణం పథ పరిరక్షణ మండలి అధ్యక్షుడు పీజీ శశికుమార్ వర్మ, కార్యదర్శి ప్రసాద్ కుజిక్కులు ఆందోళన వ్యక్తం చేశారు.

కేరళ లోని శబరిమల అయ్యప్ప ఆలయంలో Makaravilakku ఉత్సవాలు ఈనెల 14న ప్రారంభమయ్యాయి. అయ్యప్ప తాను బాల్యాన్ని గడిపనట్టుగా విశ్వసించే పందళం ప్యాలెస్ నుండి తిరునాభవరణం అని పిలువబడే ఆబరణాలు తీసుకొచ్చి అయ్యప్పకు అలంకరించారు.
అయ్యప్ప పవిత్ర ఆభరణాలను 80 కి.మీ దూరంలో ఉన్న పందళం ప్యాలెస్ నుండి ఊరేగింపుగా శబరిమల క్షేత్రానికి తీసుకు వచ్చారు.

ఆ తర్వాత దీపారాధన  చేశారు. దీపారాధన తర్వాత పతనంతిట్ట జిల్లాలోని పశ్చిమఘాట్ పర్వత శ్రేణులలోని పొన్నంబలమేడు కొండపై జ్యోతి కన్పించింది. దీపారాధనతో ఏడు రోజుల మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

అయ్యప్పకు అలంకరించిన ఆభరణాలను  తిరిగి తీసుకెళ్లే సమయానికి  కొన్ని గంటల ముందే పేలుడు పదార్ధాలు అభ్యం కావడం కలకలం రేపుతుంది. ఈ పేలుడు పదార్ధాలను ఎవరు పెట్టారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏమైనా ఈ పపిచేశారా లేదా ఇంకా ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే విషయమై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

ఈ నెల 14న శబరిమల వద్ద  75 వేల మంది భక్తులు మకర జ్యోతి దర్శనమైంది. ఈ జ్యోతి దర్శనం కోసం సుమారు 75 వేల  పైగా భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో కొంత భక్తుల సంఖ్య తగ్గిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.మకర జ్యోతి నక్షత్రం మకర సంక్రాంతి రోజున ఆకాశంలో కన్పిస్తోంది. ఇది ధనుస్సురాశి నుండి మకర రాశి వరకు సూర్యుడి సంచారాన్ని సూచిస్తుంది. జనవరి 14 నుండి మలయాళ నెల మకరం మొదటి రోజు. మకర జ్యోతి దర్శనంతో వార్షిక శబరిమల యాత్ర ముగింపును సూచిస్తుంది. మకరవిళక్కు ఉత్సవం ఏడు రోజుల పాటు నిర్వహిస్తారు. పండుగ ముగిసి కురుతి పూజ జరిగే వరకు శబరిమలలోనే ఉంటారు.

కరోనాను పురస్కరించుకొని ట్రావెన్ కోర్ బోడ్డు, అధికారులు మకర జ్యోతి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేశారు. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతున్నందున  ఈ కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు గాను కేంద్రం ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

click me!