కరోనాకి వైద్యం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతికి వల..

Published : Jul 09, 2020, 10:45 AM IST
కరోనాకి వైద్యం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతికి వల..

సారాంశం

ఈ క్రమంలో ఓ మైనర్ బాలికపై అతని కన్ను పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

కరోనా ప్రబలకుండా ఉచితంగా వైద్యం  చేస్తానంటూ అందరినీ నమ్మించాడు. అందరూ అతను మంచివాడని నమ్మేశారు. ఈ క్రమంలో ఓ మైనర్ బాలికపై అతని కన్ను పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సేలం జిల్లా పెద్దనాయకన్‌పాళయం సమీపం కరుమతురై ప్రాంతంలో క్లినిక్‌ నడుపుతున్న మదియళగన్‌ (24) కరోనా కారణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల  విద్యార్థినితో డాక్టర్‌కు పరిచయం ఏర్పడింది. 18 ఏళ్లు నిండిన తరువాత వివాహం చేసుకుంటానంటూ ఆ డాక్టర్‌ మాయమాటలు చెప్పి బాలికను మోసంచేశాడు. 

ఇదిలా ఉండగా ఆ డాక్టర్‌కు మరో అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిగినట్లు తెలుసుకున్న విద్యార్థిని దిగ్ర్భాంతికి గురైంది. దీని గురించి బాలిక కరుమతురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహరంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద డాక్టర్‌ను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఇథ‌నాల్ పెట్రోల్‌కు చీమ‌లు వ‌స్తున్నాయా.? ఈ వైర‌ల్ న్యూస్‌ నిజ‌మేనా.?
Free LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి?